petrol and diesel : సామాన్యులకు షాక్... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

petrol and diesel : సామాన్యులకు షాక్... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
petrol and diesel : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటి రూ.110కి చేరుకుంటోంది.

petrol-diesel prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటి రూ.110కి చేరుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయి. తాజాగా హైదరాబాదులో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.0.26 పైసలు పెరిగి రూ.106.77 అయింది. రూ.99.04గా ఉన్న డీజిల్ ధర ప్రస్తుతం రూ.99.37కు చేరింది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.0.39 పైసలు పెరిగి ప్రస్తుతం లీటర్ ధర రూ.109.26గా ఉంది. డీజిల్ ధర రూ.045 పైసలు పెరిగి ఏకంగా రూ.101.28కు చేరుకుంది.

ఇంధన ధరల పెరుగుదలకు కారణం..

గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ధరలు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవిత కాల కనిష్టానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్ద ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, తగ్గుతూ తాజాగా అక్టోబరు 6 నాటికి 77.50 డాలర్ల వద్ద ఉంది.

Tags

Read MoreRead Less
Next Story