ఆగని పెట్రో మంట.. పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడంతో..

ఆగని పెట్రో మంట.. పెట్రోలు, డీజిల్  రేట్లు పెరగడంతో..
Petrol and diesel prices: పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యులకు భారంగా మారితే.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం కాసుల పంట కురిపిస్తున్నాయి.

Petrol and Diesel prices: పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యులకు భారంగా మారితే.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం కాసుల పంట కురిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెట్రోలియం విభాగం ద్వారా కేంద్ర ఆదాయం 45 శాతానికి పైగా పెరిగింది.గత ఏడాది కాలంగా దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం వందరూపాయలు పైనే ఉంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పెట్రోల్​, డీజిల్ ధరలు రికార్డు స్థాయి వద్దే కొనసాగుతోంది. ఇలా పెట్రోల్ ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు గత ఏడాది భారీగా నిధులు సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుతానికి పెట్రోలియం విభాగం ద్వారా వచ్చే ఆదాయం 45 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2020-21 ముగింపు సమయానికి దేశంలో పెట్రోల్​ ధర లీటర్​90 వద్ద, లీటర్ డీజిల్ ధర81 రూపాయల వద్ద ఉన్నాయి.ప్రస్తుతం.. పెట్రోల్ ధర లీటర 101.54 వద్ద ఉంటే.. డీజిల్ ధర 89.87 రూపాయల వద్ద ఉంది.

పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా కేంద్రానికి గత ఆర్థిక సంవత్సరం 4 లక్షల 18 వేల 637 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్​ డ్యూటీ, కస్టమ్స్​ డ్యూటీ, కేంద్ర రాష్ట్ర జీఎస్​టీ, రాయల్టీ పేమెంట్స్​ అన్నీ కలిపి ఈ ఆదాయాన్ని గడించింది కేంద్రం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం కేవలం 2 లక్షల 87 వేల 540 కోట్లు మాత్రమే ఉండేది. అంటే.. గత ఆర్థిక సంవత్సరం కేంద్రం లక్షా 31 వేల 97 కోట్లు పెరిగింది. కార్పొరేట్​ పన్నులు, డివిడెండ్​ ఆదాయం, డివిడెండ్ పంపిణీ పన్ను, చమురు, గ్యాస్​ నిక్షేపాల గుర్తింపు ద్వారా లభించిన ఆదాయం చూస్తే.. గత ఆర్థిక సంవత్సరం కేంద్రం మొత్తం4 లక్షల 53 వేల 812 కోట్లు గడించింది.

ఎన్​డీఏ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత.. తొలి ఆర్థిక సంవత్సరమైన 2014-15లో పెట్రోలియం విభాగం ద్వారా కేంద్రం లక్షా26 వేల25 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఆరేళ్ల తర్వాత ఆదాయం 4 లక్ష18 వేల 637 కోట్లకు పెరిగింది. అంటే ఆరేళ్లలో ఈ రంగం ద్వారా కేంద్రం ఆదాయం 230 శాతం పెరిగింది.

ఇదే సమయంలో ఎక్సైజ్​ సుంకాలు.. 275 శాతం పెరిగి.. రూ.99,068 కోట్ల నుంచి రూ.3,71,725 కోట్లకు పెరిగాయి. పెట్రోలియం రంగం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగితే రాష్ట్రాలు మాత్రం కాస్త వెనకబడ్డాయి. రాష్ట్రాల ఆదాయం 2020-21లో రూ.2,17,271 కోట్లకు పడిపోయినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story