Phone Pe processing fee : ఫోన్‌‌పే బాదుడు షురూ.. రూ. 50 దాటితే..!

Phone Pe processing fee : ఫోన్‌‌పే బాదుడు షురూ.. రూ. 50 దాటితే..!
Phone Pe processing fee : మొదట్లో ఉచితంగా ఇచ్చి జనాలకి అలవాటు చేసి ఆ తరవాత బాదడం కార్పొరేట్ కంపెనీల‌కు అల‌వాటే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది ఫోన్‌‌పే కూడా..

Phone Pe processing fee : మొదట్లో ఉచితంగా ఇచ్చి జనాలకి అలవాటు చేసి ఆ తరవాత బాదడం కార్పొరేట్ కంపెనీల‌కు అల‌వాటే.. ఇప్పుడు అదే బాటలో నడుస్తోంది ఫోన్‌‌పే కూడా... ఇన్నిరోజులు సేవలను ఉచితంగా అందిస్తూ రాగా.. ఇప్పుడు బాదుడు షురూ చేసింది.. మొబైల్‌ రీచార్జ్‌లపై ప్రాసెసింగ్‌ ఫీజులను వసూలు చేస్తోంది. రూ. 50, అంత‌కుమించిన రీచార్జ్ లపైన రూ.2 చొప్పున ఛార్జ్ చేస్తోంది.

ఒక్క ఫోన్‌‌పే తప్ప ఇతరే సంస్థలు కూడా యూపీఐ లావాదేవీలపై చార్జీలను వసూలు చేయడం లేదు.. ఇప్పుడు ఫోన్‌‌పే లాగే ఇతర సంస్థలూ కూడా అదే బాట పట్టేలా కనిపిస్తున్నాయి. డిజిట‌ల్ చెల్లింపుల్లో 40 శాతం వాటా ఫోన్‌పేదే. సెప్టెంబరులో 165 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహించిన రికార్డు సొంతం చేసుకుంది.

అయితే ఫోన్‌పే యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్‌లపై రూ .50 వరకు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకుంటారని కంపెనీ తెలిపింది. రూ. 51 పైన మూడు ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్‌లు పూర్తయిన తర్వాత ఇది వినియోగదారులకు వర్తిస్తుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story