Rakesh Jhunjhunwala: ఆ కంపెనీ షేర్లు కొన్న 24 గంటల్లో రూ.21 కోట్లు సంపాదన

Rakesh Jhunjhunwala: ఆ కంపెనీ షేర్లు కొన్న 24 గంటల్లో రూ.21 కోట్లు సంపాదన
తన అకౌంట్‌లోనూ కోట్ల రూపాయలు వేసుకున్న తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.

Rakesh Jhunjhunwala:ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ న్యూస్ చూస్తే అర్థమవుతుంది. ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న కంపెనీ స్టేక్‌ను కొనుగోలు చేసి ఒక్కసారిగా ఆ కంపెనీకి కేవలం 24 గంటల్లోనే తిరిగి జీవం పోయడమే కాదు.. తన అకౌంట్‌లోనూ కోట్ల రూపాయలు వేసుకున్న తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల జీ మీడియా గ్రూపు షేర్లు మార్కెట్‌లో ఒడిదుడుకులకు లోనయ్యాయి.

ఈ క్రమంలోనే దాని అగ్రశ్రేణి వాటాదారులు ఇద్దరు ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO పునిత్ గోయెంకా మరియు ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లను బోర్డు నుంచి తొలగించాలని పట్టుబట్టారు. ఈ విషయమై రెగ్యులేటరీ దాఖలు చేయడంతో కంపెనీ షేర్లకు కాస్త జీవం వచ్చింది. ఈ సమయంలోనే రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా భారీగా షేర్లు కొన్నారంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా షేర్‌ ధర రూ.220.44 నుంచి పుంజుకుంది.

మంగళవారం సెప్టెంబర్ 14, 2021 న ఎన్‌ఎస్‌ఈలో బల్క్ డీల్ లావాదేవీల ద్వారా రేర్ ఎంటర్‌ప్రైజెస్ 5 మిలియన్ ఈక్విటీ షేర్లను షేర్‌కు రూ. 220.44 చొప్పున కొనుగోలు చేసింది. దీంతో జీ మీడియా గ్రూప్ షేర్లకు రెక్కలొచ్చాయి. అదే రోజు సాయంత్రానికి ఒక షేర్ ధర రూ.261.50 వద్ద ముగిసింది.

దీంతో దాదాపు రూ.20 కోట్లు బిగ్‌బుల్ అకౌంట్‌లో పడ్డాయి. అంతే కాదు.. గత గురువారం సాయంత్రం మార్కెట్‌ ముగిసే సమయానికి జీ షేరు ధర 52 వారాల గరిష్ట స్థాయిలను తాకుతూ ఇంట్రాడేలో రూ. 295.15 దగ్గర ట్రేడవుతూ ఆయన ఖాతాలోకి మరింత డబ్బును జమ చేసింది. బిగ్‌బుల్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే.

Tags

Read MoreRead Less
Next Story