Nano car: నానో కారుకు ప్రేరణ: రతన్ టాటా ఇన్‌స్టా పోస్టులో వివరణ

Nano car: నానో కారుకు ప్రేరణ: రతన్ టాటా ఇన్‌స్టా పోస్టులో వివరణ
Nano car: రతన్ టాటా నానో కారును విడుదల చేయడానికి తనను ప్రేరేపించిన కారణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు.

Nano car: రతన్ టాటా నానో కారును విడుదల చేయడానికి తనను ప్రేరేపించిన కారణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు.

నానో, అత్యంత సరసమైన కార్లలో ఒకటిగా పేర్కొనబడింది. ఇది పరిచయం అవసరం లేని పేరు. నానో కారును 2008లో రిలీజ్ చేశారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ కారు నిలిపివేసినా చాలా మంది కుటుంబాల్లో నానో ఒక భాగమైంది. టాటా సన్స్ ఎమెరిటస్ చైర్మన్ రతన్ టాటా షేర్ చేసిన పోస్ట్‌ను అనుసరించి కారు మళ్లీ ఒకసారి వార్తల్లోకి వచ్చింది.

టాటా నానో కారు పక్కన ఉన్న ఫోటోను షేర్ చేయడానికి టాటా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు వెళ్లారు. క్యాప్షన్‌లో వాహనాన్ని ప్రారంభించేందుకు తనను ప్రేరేపించిన అంశాల గురించి వివరించారు.

"నన్ను నిజంగా ప్రేరేపించినది, అలాంటి వాహనాన్ని తయారు చేయాలనే కోరికను రేకెత్తించిన అంశం.. భారతీయ కుటుంబాలను స్కూటర్‌లపై నిరంతరం చూడటం, తల్లి తండ్రి మధ్య ఉన్న పిల్లవాడు, మరొక చిన్నారి.. నలుగురు ఆ చిన్న బండి మీద ఎలా వెళుతున్నారో అని ఆందోళన చెందాను.. వారు ఎక్కడికి వెళుతున్నారో, గతుకుల రోడ్లపై ప్రయాణించడం, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారా లేదా.. ఇవన్నీ నాలో ఆలోచనలు రేకెత్తించాయి. దాంతో వారి కోసం ఏమైనా చేయాలనుకున్నాను.

నాకు స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో ప్రవేశం ఉండటం వల్ల ఖాళీగా ఉన్నప్పుడు డ్రాయింగ్ చేస్తుండేవాడిని. మొదట నేను, నా టీమ్ అంతా కలిసి ద్విచక్ర వాహనాలను సురక్షితంగా ఎలా తయారు చేయాలా అని ఆలోచించాము.. ఆ సమయంలో నేను నాలుగు చక్రాలతో ఓ డ్రాయింగ్ గీశాను.. అయితే దానికి కిటికీలు లేవు, తలుపులు లేవు. కేవలం అది ఒక డూన్ బగ్గీ మాత్రమే. కానీ నేను చివరకు అది కారు అని నిర్ణయించుకున్నాను. అదే తరువాత నానోగా రూపాంతరం చెందింది అని అతను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ లో రాసుకొచ్చారు.

పోస్ట్ గంట క్రితం షేర్ చేయబడింది. అయితే షేర్ చేసినప్పటి నుండి, దాదాపు 5.2 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ పోస్ట్ కు నెటిజన్స్ నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది.

"మీరు ఎల్లప్పుడూ మానవజాతి ప్రయోజనం కోసం ఆలోచించారు! సర్," అని ఒక నెటిజన్ రాయగా, "రతన్ టాటా జీ మీరు నిజమైన రత్నం, చాలా మందికి స్ఫూర్తి" అని మరొకరు పంచుకున్నారు. "మీరు మా ఇన్స్పిరేషన్ సార్" అని మరికొందరు రతన్ టాటాని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story