వాట్సప్‌ సంస్థకు రూ.1,950 కోట్ల జరిమానా..!

వాట్సప్‌ సంస్థకు రూ.1,950 కోట్ల జరిమానా..!
ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక వాట్సప్‌కు ....ఎదురుదెబ్బ తగిలింది. ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్... వాట్సప్‌ సంస్థకు వెయ్యి 950 కోట్ల జరిమానా విధించింది.

ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక వాట్సప్‌కు ....ఎదురుదెబ్బ తగిలింది. ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్... వాట్సప్‌ సంస్థకు వెయ్యి 950 కోట్ల జరిమానా విధించింది. 2018లో యూరోపియన్‌ యూనియన్‌ డేటా పరిరక్షణ నిబంధనలను వాట్సప్...ఉల్లంఘించినట్లు కమిషన్ నిర్ధరించింది. పర్సనల్ ఇష్యూలను..ఫేస్‌బుక్ అనుబంధ సంస్థలతో...వాట్సప్ పంచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. సిక్రెట్‌కు వాట్సప్ భంగం కలిగించిందని తేల్చింది. ఇందుకు పరిహారంగా వాట్సప్‌నకు... 225 మిలియన్‌ యూరోల జరిమానా విధిస్తూ గురువారం నిర్ణయం ప్రకటించింది.

పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తూ... యూరోపియన్‌ యూనియన్‌ 'జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌' పేరుతో మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. సోషల్‌ మీడియాలు వీటిని కంపల్సరీ...అనుసరించాలని స్పష్టం చేసింది కమిషన్‌. అయినా వాట్సప్‌ ఈ నిబంధనలకు తూట్లు పొడిచిందని పేర్కొంది. ఇది ఇలా ఉంటే....EU నిబంధనలకు అనుగుణంగా డేటా ప్రాసెసింగ్‌ విధానాలను మార్చుకోవాలని ఆ సంస్థకు మరోసారి సూచించింది. మరోవైపు ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ తమకు జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో వాట్సప్‌ విభేదించింది.

Tags

Read MoreRead Less
Next Story