Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
ఆల్‌టైమ్‌ కనిష్టానికి రూపాయి విలువ


AA

* 54 మార్కును క్రాస్‌ చేసిన రూపాయి
* యూరో సంక్షోభమే డాలర్‌ బలోపేతానికి కారణం
* రూపాయి పతనంపై చేతులెత్తేసిన ఆర్‌బీఐ


రూపాయి మారకం విలువ ఇవాళ మరింత క్షీణించింది. ఫారెక్స్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూపాయి విలువ 54 మార్కును క్రాస్‌ చేసి ఆల్‌టైమ్‌ కనిష్టానికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 57 పైసలు బలహీనపడి 54.27 స్థాయి దగ్గర ట్రేడవుతోంది. యూరో సంక్షోభం నేపథ్యంలో డాలర్‌కు డిమాండ్‌ ఊహించని స్థాయిలో పెరిగింది. దీంతో రూపాయి పతనంలో జోక్యం చేసుకోలేమని ఆర్‌బీఐ చేతులెత్తేసింది. మరోవైపు రూపాయి మరింతగా క్షీణిస్తే భారతఆర్థిక వ్యవస్థకు ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published Date : Thursday, 15/12/2011 12:33 PM IST