46 కొత్త విమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వ్యాపార విస్తరణలో భాగంగా కొత్త విమానాలను కొనాలనుకుంటున్న స్పైస్‌జెట్, ఇండిగో, జెట్ లైట్ కంపెనీలకు లైన్ క్లియర్ అయింది. 46 విమానాల కొనుగోళ్ళకు పౌర విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విమానాల కొనుగోలు కోసం మొత్తం మూడు కంపెనీలు కలసి రూ. 19,000 కోట్లను వెచ్చిస్తున్నాయి. మూడు కంపెనీలు కొనబోతున్న మొత్తం 46 విమానాల్లో అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీవే 32 ఉన్నాయి. మిగిలిన 14 విమానాలు యూరప్‌కు చెందిన ఎయిర్‌బస్ కంపెనీ నుంచి కొంటున్నాయి. కొత్త విమానాలు కొనబోతున్న ఎయిర్‌లైన సంస్థల వివరాలు: ఎయిర్‌లైన్ కొత్త విమానాలు ప్రస్తుత విమానాల సంఖ్య స్పైస్ జెట్ 30 21 ఇండిగో 14 27 జెట్‌లైట్ 2 23 దేశంలోని మొత్తం ప్రయాణికుల్లో సగం మందికి ఈ మూడు ఎయిర్‌లైన్స్ సేవలందిస్తున్నాయి.
Published Date : Sep 05, Sunday 06:35PM IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


