Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
రూ 25 వేలకోట్ల రుణ వేటలో టాటా స్టీల్


AA


ప్రైవేట్ రంగంలో ఉక్కు ఉత్పత్తిలో ప్రముఖ కంపెనీ అయిన టాటా స్టీల్ భారీ రుణ సమీకరణకు కసరత్తు చేస్తోంది. బ్రిటన్‌లోని తన యూనిట్‌కు కావాల్సిన 3.5 బిలియన్ పౌండ్ల (దాదాపు 25,000 కోట్ల రూపాయలు) ను సమీకరించేందుకు ఇప్పటికే 11 బ్యాంకులతో చర్చలు జరిపినట్లు తెలిస్తోంది.వీటిలోబిఎన్‌పి పరిబాస్ ఎస్ఎ, క్రెడిట్ అగ్రికోల్, సిఐబి, హెచ్ఎస్‌బిసి హోల్డింగ్స్ బిఎల్‌సి, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ గ్రూప్ పిఎల్‌సి బ్యాంకులు 2.5 బిలియన్ పౌండ్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. సిటీ గ్రూప్ ఇంక్, డాయిష్ బ్యాంక్ ఎజి, స్టాండర్డ్ చార్టర్డ్ పిఎల్‌సి, ఐఎన్‌జి వైశ్యా బ్యాంక్‌లు కూడా రుణం ఇచ్చే అవకాశం ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కూడా బిలియన్ పౌండ్ల రుణం ఇచ్చే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి టాటా స్టీల్ అధికార వర్గాలు నిరాకరించాయి.

Published Date : Sep 05, Sunday 06:50PM IST