అనిల్‌పై విచారణకు మరింత గడువిచ్చిన సెబీ

అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్, రిలయన్స్ ఇన్‌ఫ్రా స్టాక్ మార్కెట్ అవకతవలకు పాల్పడిన దానిపై విచారణ జరిపేందుకు సెబీ మరింత గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీతో పాటు కంపెనీ ఉన్నతాధికారులకు స్వంతంగా సెబీ ముందు హాజరయి తమ వాదనను వినిపించేదుకు మరో అవకాశం ఇచ్చింది. రెండు కంపెనీలకు చెందిన ప్రతినిధులతో పాటు కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ సెబీతో సంప్రదింపులు జరుపుతున్నారు. కంపెనీకి చెందిన పత్రాలను కూడా సెబీకి అందుబాటులో ఉంచారు. గత నెల సెబీ అనీల్ అంబానీకి చెందిన రెండు కంపెనీలకు చెందిన ప్రతినిధులు సెప్టెంబర్ 3వ తేదీన హాజరు కావాలని సూచించింది. ఆర్‌ఎన్‌ఆర్‌ఎల్, ఆర్ ఇన్‌ఫ్రాకుచెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు రెండు గ్రూపులకు చెందిన చైర్మన్ అనిల్ అంబానీ, వైస్ చైర్మన్ సతీష్ షా, డైరెక్టర్లు జెపీ చలసానీ, ఎస్ సీ గుప్తాలు, లలిత్ జలాన్‌లు హాజరుకావాలని సెబీ ఆదేశించింది. సెప్టెంబర్ రెండవ తేదీన సెబీ అడాగ్‌కు చెందిన చైర్మన్‌లతో పాటు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు మరొక అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
Published Date : Sep 05, Sunday 07:30PM IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


