SBI కోటీశ్వరుల బ్రాంచ్ ప్రారంభం

సాధారణ ప్రజల బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ), కేవలం కోటీశ్వరులకు మాత్రమే సేవలను అందించే ఉద్ధేశ్యంతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఒక కొత్త బ్రాంచిని ప్రారంభించింది. దేశం మొత్తం మీద ఎస్‌బిఐ ఇటువంటి వంటి శాఖను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇందులో ఖాతా ప్రారంభించటానికి కనీస మొత్తం ఒక కోటి రూపాయలు కావలసి ఉంది. కోహినూర్ బంజారా ప్రీమియం బ్యాంకింగ్ సెంటర్ పేరుతోహెచ్‌ఎన్‌ఐ (హైనెట్ వర్త ఇండివిడ్యూయల్స్) బ్రాంచిని 4000 చదరపు అడుగుల విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేసారు. ఇందులో ఎల్లవేళలా అనగా ప్రతిరోజు 24 గంటలూ వినియోగించుకొనేట్లుగా లాకర్ సౌకర్యం, రిలేషన్‌షిప్ మేనేజర్, అదిక సమయం తెరిచి ఉండేట్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఇంటివద్దకు అన్ని సేవలను అందించటానికి అనువుగా సదుపాయాలు కలిగి ఉంటాయని ప్రకటించారు. ఇప్పటికే ఈ బ్రాంచిలో 50 ఖాతాలను ప్రారంభించామని, ఈ ఏడాది చివరి నాటికి 150 ఖాతాలను ప్రారంభించగలమని బ్యాంకు సిజిఎమ్ శివకుమార్ వివరించారు. విలాసవంతమైన సౌకర్యాలతో నిజామ్ లాంజ్, పిరల్ కాఫీ బార్ తదితర ఐదు నక్షత్రాల హోటల్‌లను తలపించే విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేసారు.
ఇక రూబీ, ఎమిరాల్డ్ బిజినెస్ సెంటర్‌లు, వీడియో కాన్ఫెరెన్సుతో కూడిన సాఫైర్ కాన్పెరెన్సు రూమ్ సౌకర్యాలు కూడా ఖాతాదారులకు ఏర్పాటు చేసిన ఈ బ్రాంచిని బ్యాంకింగ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ దివాకర్ గుప్తా ప్రారంభించారు. ఇటువంటి హెచ్‌ఎన్‌ఐ ఖాతాదారుల కొరకై ఏర్పాటు చేసిన బ్రాంచిలు ఇప్పటి దాకా 150 దాకా ఉంటాయని గుప్తా వివరించారు.
Published Date : Sep 05, Sunday 07:51PM IST
Be the first comment of this article
| |
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


