చూపులు ఒకమ్మాయితో.. పెళ్లి మరో అమ్మాయితో.. బాధతో వరుడు..

పెళ్లి చూపులకు రమ్మని కబురు చేస్తే వెళ్లాడు. అమ్మాయి నచ్చడంతో ఓకే అన్నాడు. ఈ నెల 2న వివాహం కూడా జరిగింది. అంతలోనే ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. పెళ్లైన రెండు రోజులకే ప్రాణాలు తీసుకున్నాడు. కారణాలు విచారిస్తే.. విజయనగరానికి చెందిన మదీన్ చీపురుపల్లి మండలంలోని పెదనడపల్లిలో వీఆర్‌వోగా పనిచేస్తున్నాడు. ఈమధ్య బ్యాంకు పరీక్షల్లో కూడా విజయం సాధించాడు.

తల్లిదండ్రులు అతడికి పెళ్లి చేయాలనుకోవడంతో సంబందం చూశామని కబురు చేస్తే వెళ్లాడు. సాలూరుకు చెందిన మహ్మద్ మోబినాతో పెళ్లి చూపులు జరిగాయి. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వైభవంగా వివాహం జరిపించారు. అనంతరం 3న విజయనగరం చేరుకున్నారు. 4న రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులందరూ వేడుక ఏర్పాట్లలో సంతోషంగా ఉండగా.. మదీన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు వెతకడం ప్రారంభించారు. బాబామెట్టకు చెందిన వారి పాత ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. పెళ్లైన రెండో రోజే బిడ్డ అలా కనపించేసరికి తల్లితండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

పెళ్లి చూపుల్లో ఒకమ్మాయిని చూపించి మరో అమ్మాయితో వివాహం జరిపించడాన్ని జీర్ణించుకోలేకే, మోసపోయానన్న బాధతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులు బిడ్డని ఆ పరిస్థితిలో చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బంధువులంతా విచారంలో మునిగిపోయారు. వరుడికి, వారి కుటుంబసభ్యులకి ముందుగానే ఈ విషయాన్ని తెలిపినా మదీన్ ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని వధువు తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇష్టం లేకపోతే మొదటే చెప్పి ఉండాల్సింది అని కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

మహిళ స్నానం చేస్తుండగా ఫొటోలు.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం..

ఓ నీచుడి వేధింపులు మహిళ ప్రాణాల మీదికి తెచ్చాయి. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. కానీ ఆమె గోడును పట్టించుకున్నవారే లేరు. ఖాకీల తీరుపై ఆగ్రహించింది. ఏకంగా పోలీస్ స్టేషన్‌ ముందే ఆత్మహత్యాయత్నం చేసింది.

అందరూ చూస్తుండగానే పోలీస్ స్టేషన్‌ ముందు ఆత్మహత్యా యత్నం చేసింది సబిత. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఆమెను చుట్టుముట్టాయి.

woman, suicide

రోడ్డుపై వెళ్లేవాళ్లు… పోలీసులు కలిసి ఎలాగోలా మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే ఆమె శరీరం 70 శాతం వరకు కాలిపోయింది. ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది. సబితది బేగంపేటలోని అన్నానగర్‌. బాత్రూంలో స్నానం చేస్తుండగా వెంకటేష్ గౌడ్ అనే పోకిరి తన ఫొటోలు తీశాడని, వాటిని అడ్డం పెట్టుకుని వేధిస్తున్నాడని బేగంపేట్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు పట్టించుకోకపోవడంతో బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా వెంకటేష్‌గౌడ్‌పై ఫిర్యాదు చేసింది. కానీ వాళ్లు కూడా పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందింది.

సూసైడ్ నోట్ రాసుకుని, కిరోసిన్ తీసుకుని బోయిన్‌పల్లి పీఎస్‌కు చేరింది. స్టేషన్‌కు ఎదురుగా రోడ్డుపక్కనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఆర్పడానికి పోలీసులు, స్థానికులు ప్రయత్నించారు. కానీ అప్పటికే తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణం అంటున్నారు పోలీసులు.

70 శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం సబిత చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మరో 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యు అంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సబిత వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. వెంకటేష్ గౌడ్ చేసిన వెదవ పనికితోడు పోలీసుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టింది. పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు ఖాకీల తీరుపై మండిపడుతున్నారు.

ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిలకు వలవేసి…

ఆ కంత్రీ… నేరాలకు ఫేస్‌బుక్‌నే అడ్డాగా మార్చుకున్నాడు. అందమైన అమ్మాయిలకు వలవేస్తాడు. ఒక్కసారి అందులో చిక్కుకుంటే బయటపడడం కష్టం. వాళ్ల పర్సనల్ డిటేల్స్ సేకరిస్తాడు. వాటిని అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరికొందరికి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలంటూ ట్రాప్ చేశాడు. ఇలా ఎంతోమందిని మోసం చేశాడు ఆ కేటుగాడు. అతడిని పట్టుకోడానికి పోలీసులు ఆరు నెలలు శ్రమించాల్సి వచ్చింది.

దొంగ చూపులు చూస్తున్న ఈ కేటుగాడే ఎంతో మందిని మోసం చేశాడు. పేరు జోగాడ వంశీ కృష్ణ. ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయిలకు వలవేసేవాడు. వాళ్ల వ్యక్తిగత వివరాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. భయపడిన అమ్మాయిల నుంచి డబ్బు, బంగారు నగలు లాక్కుని… జల్సాలు చేసేవాడు.

ఈ కేటుగాడి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ట్రిపుల్‌ఈ చదివి లైఫ్‌లో సెటిల్ కావల్సిన వాడు… జల్సాలకు అలవాటు పడి పెడతోవ పట్టాడు. 2012లో పెద్దాపురం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈఈఈలో చేరాడు. కానీ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈజీమనీకి అలవాటుపడి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. కానీ ఈ కంత్రీ అక్కడ పనిచేసే అమ్మాయిలపై కన్నేశాడు. యువతులతో పరిచయం పెంచుకుని మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. కొంతమంది దగ్గర లక్షలాది రూపాయలు తీసుకుని మళ్లీ కాకినాడకు మకాం మార్చాడు.

కాకినాడలో మరో కొత్త దందా మొదలు పెట్టాడు. ఫేస్‌బుక్‌నే అడ్డాగా చేసుకుని అందమైన అమ్మాయిలకు వలవేశాడు. ఓ వైద్య విద్యార్థినితో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని ఆమె వ్యక్తిగత సమాచారం సేకరించాడు. దాన్ని అడ్డంపెట్టుకుని ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమె దగ్గరి నుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నాడు.

మోసపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో వంశీకృష్ణ బండారం బయటపడింది. అయితే పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగాడు. గత ఆరు నెలల్లో 25 సిమ్‌కార్డులు మార్చి పోలీసులకు ముప్పతిప్పలు పెట్టాడు ఈ ఫేస్‌బుక్ మోసగాడు.

 

యువతుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో దర్జాగా జల్సాలు చేశాడు వంశీకృష్ణ. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు… అతడి దగ్గరి నుంచి 70 వేల నగదు, లక్ష రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయం లేని వ్యక్తులతో ఫేస్‌బుక్‌లో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. తస్మాత్ జాగ్రత్త.

 

చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆడియాలజీ విద్యార్థిని..

చదువు పూర్తయింది.. అప్రెంటీస్‌గా చేస్తోంది.. ఒత్తిడి తట్టుకోలేక పోతున్నాననంటూ తల్లిదండ్రుల దగ్గర మొరపెట్టుకుంది. వారు సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. అంప్రెటీస్ షిప్ పూర్తి చేసుకుని రమ్మన్నారు. వెళ్లలేనంటూ ఉరివేసుకుని జీవితాన్ని ముగించేసింది ఆడియాలజీ విద్యార్థిని.

వేంపల్లెకు చెందిన లావణ్య కడపలో ఆడియాలజీ కోర్సు పూర్తిచేసింది. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో అప్రెంటీస్ చేస్తోంది. చదవలేక పోతున్నాను.. ఇక్కడ ఒత్తిడి తట్టుకోలేకున్నాను అంటూ కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది లావణ్య. దీంతో ఆమెను ఇంటికి పిలిపించుకున్నారు తల్లిదండ్రులు. అప్రెంటీస్‌ పూర్తిచేయాలని సర్థి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోతున్న సమయంలో లావణ్య ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులు లేచి గమనించగా పక్కగదిలో లావణ్య ఉరివేసుకొని కనిపించింది.
చదువులో వెనకబడి పోతున్నా, ఒత్తిడికి గురవుతున్నాను, నా చావుకు ఎవరూ కారణం కాదంటూ లావణ్య రాసిన సూసైడ్‌ నోట్‌ను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓల్డ్‌ సిటీలో ఓ యువకుడి హత్య కలకలం

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. భవానీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తలాబ్‌కట్ట చాచా గ్యారేజీ వద్ద డ్రైవర్‌ షేక్‌ బాబా దారుణం హత్యకు గురయ్యాడు. చిన్నచిన్న గొడవలతో స్నేహితులే కత్తులతో పొడిచి.. షేక్‌ బాబాను చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఉస్మానియా మార్చురీకి మృతదేహాన్ని తరలించిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

పసిపిల్లల్ని చంపి ప్రియుడితో పరారైన మహిళ : ఆమె చెప్పే మాటలు వింటే..

ప్రియుడికోసం కడుపున పుట్టిన పిల్లలను అంతమొందించిన మహిళ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లల్ని హత్య చేసి ప్రియుడితో కలిసి కేరళ వెళ్లిపోయింది అభిరామి. అయితే అనూహ్యంగా పోలీసులకు దొరికి చేసిన తప్పును ఒప్పుకుంది. తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని. నిత్యం అనుమానించేవాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. మొదట తన భర్తను హత్య చేయాలనుకున్నా సాధ్య పడలేదు. దాంతో భర్తమీద కోపంతో పిల్లలను హత్య చేసినట్టు ఆమె పోలీసులకు వివరించింది. కొద్ది నెలల కిందట స్థానిక బిర్యానీ దుకాణంలో పనిచేసే సుందరంతో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం ప్రేమగా మారింది. భర్త ఇంట్లో లేని సమయంలో బిర్యానీ ఆర్డర్‌ చేసి, సుందరాన్ని తరచూ ఇంటికి రప్పించుకునే దాన్నని తెలిపింది. సుందరంతో వివాహేతర సంబంధం భర్త కనిపెట్టాడని. ఈ క్రమంలో ఇద్దరికీ గొడవలు జరిగాయి. ఇంట్లో వాళ్ళు సర్ది చెప్పారు. కానీ తాను సుందరంతో సంబంధాన్ని కొనసాగించాను. దాంతో భర్త అడ్డుగా ఉండటంతో అతన్ని అంతమొందించాలని అనుకున్నాను. కానీ ప్రియుడి సహాయంతో పిల్లలను హత్య చేశానని వెల్లడించింది.

 

డబ్బు కోసం బరితెగించిన భార్య.. కట్టుకున్నోడిని ఖతం చేసింది.

డబ్బు కోసం ఓ ఇల్లాలు బరితెగించింది. కిరాయి హంతకులతో కలిసి కట్టుకున్నోడిని ఖతం చేసింది. భర్త చస్తే ఉద్యోగం, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఆశపడింది. సుపారీ ఇచ్చి మరీ మర్డర్ చేయించింది. దారుణంగా చంపించి యాక్సిడెంట్‌గా చిత్రీకరించింది. కానీ కథ అడ్డం తిరిగింది. అది ప్రమాదం కాదు… హత్య అని తేల్చారు పోలీసులు. నిందితుల చేతులకు బేడీలు వేసి కటకటాల వెనక్కు నెట్టారు.

పోస్టల్ ఉద్యోగి కేశవ నాయక్‌ను దారుణంగా చంపేసిన కిరాతకులు ఇదిగో వీళ్లే. భర్తను చంపితే అతడి మరణం తర్వాత ఉద్యోగం వస్తుంది. ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. వాటితో హ్యాపీగా బతకొచ్చని… కేశవ నాయక్‌ మర్డర్‌కు స్కెచ్ వేసింది పద్మ. తన మర్డర్‌ ప్లాన్‌ను వినోద్‌కు వివరించి… అతడితో భర్తను చంపించింది… కేతవత్ పద్మ… ఈమె కేశవ నాయక్ మొదటి భార్య. పద్మ దగ్గర సుపారీ తీసుకుని కేశవ నాయక్‌ను హత్య చేశాడు సభావత్ వినోద్. హత్యను యాక్సిడెంట్‌గా చిత్రీకరించే యత్నం చేశాడు.

కేశవ నాయక్‌ను దారుణంగా కారులోనే చంపేశాడు వినోద్. ఆ తర్వాత కారును విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు. కానీ డెడ్‌ బాడీని హాస్పిటల్‌కు తరలించేటప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది. చివరికి వాళ్ల డౌట్ నిజమైంది. ఇది యాక్సిడెంట్ కాదు… హత్యే అని తేల్చారు. రెండు రోజుల్లోనే కేసు మిస్టరీని ఛేదించారు.

కేశవ నాయక్‌ స్వస్థలం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడా గ్రామం. పోస్టల్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న కేశవ నాయక్‌… 20 ఏళ్ల క్రితం కేతవత్ పద్మతో పెళ్లయింది. వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కోర్టుకు వెళ్లారు. మరోవైపు శైలజను రెండో పెళ్లి చేసుకున్నాడు కేశవ నాయక్. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తనను పట్టించుకోవడం లేదని పద్మ ఆగ్రహంతో రగిలిపోయింది. ఎలాగైనా భర్తను చంపితే అతడి ఉద్యోగం, అతడి పేరున ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని భావించింది. భర్తను చంపడానికి…అతడి దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వినోద్‌కు సుపారీ ఇచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల్లో 10 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అడ్వాన్స్‌గా 15 వేలు ఇచ్చింది. భర్తను ఎలా మర్డర్ చేయాలో కూడా పద్మనే వినోద్‌కు వివరించింది. అనుకున్నట్లే ఈ నెల ఒకటిన కేశవ నాయక్‌ను మర్డర్ చేశాడు వినోద్. ఆ తర్వాత యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు.

కారులోనే హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఇంజపూర్ కామన్ దగ్గర ఉన్న హై టెన్షన్ స్తంభానికి కారును ఢీకొట్టి యాక్సిడెంట్‌ చేశాడు వినోద్. దాన్ని ప్రమాదంగా చిత్రించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు… తన భర్త… కారు యాక్సిడెంట్‌లో చనిపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పద్మ. కేసును తప్పుదోవ పట్టించాలనుకుంది. కానీ కేశవ నాయక్‌ మెడపై ఉన్న గుర్తులను బట్టి ఇది మర్డర్ అని తేల్చారు పోలీసులు. ఏ1గా వినోద్, ఏ2గా పద్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

బీమా డబ్బుల కోసం ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య

బీమా డబ్బుల కోసం భర్తను చంపిందో భార్య. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట వనస్థలిపురం పరిధిలోని గుర్రంగూడ దగ్గర ప్రమాదం జరిగింది. కరెంట్‌ స్తంభాన్ని కారు ఢీ కొనడంతో కారులో ఉన్న కేస్య నాయక్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య పద్మ ఫిర్యాదుతో విచారణ చేసిన పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి.

భార్య తీరుపై అనుమానంతో ఆరా తీస్తే.. ఆమె నేరం ఒప్పుకుంది.. భర్త ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, బీమా డబ్బులు వస్తాయనే ఆశతో.. ప్రియుడు వినోద్‌ తో కలిసి భర్త హత్యకు ప్లాన్‌ చేసినట్టు ఒప్పకుంది. కారులో భర్తకు ఊపిరి ఆడనివ్వకుండా చేసి.. తరువాత ప్రమాదంగా చిత్రీకరించిది పద్మ. నేరాన్ని ఒప్పుకోవడంతో పద్మతో పాటు ఆమె ప్రియుడు వినోద్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఉద్యోగం రాలేదని ఆత్మహత్య

కుసుమ అనే నిరుద్యోగ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కడప జిల్లాలోని రాయచోటి పట్టణంలో చోటుచేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభించింది.” నేను ఎంత కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదు. అలాంటప్పుడు నేను చచ్చినా..బతికిన ఒక్కటే అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను ” అని సూసైడ్‌ నోట్‌‌లో రాసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మురళీకృష్ణ అనే వ్యక్తి భార్య కుసుమతో కలిసి రాయచోటి పట్టణ పరిధిలోని బోస్‌ నగర్‌లో నివిస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ కలసి రాయచోటి పట్టణానికి వచ్చి ప్రైవేట్‌ సంస్థలలో పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. కుసుమ ప్రవేట్ సంస్థలో పనిచేస్తూ పోటి పరీక్షలకు సిద్ధం అవుతోంది. ఉద్యొగం సంపాదించాలనే పట్టుదలతో ఇంటిలోనే ఉంటూ ఎంతో శ్రద్ధగా చదివేది. గత పోటీ పరీక్షలలో ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడింది.

ప్రేమించిన యువతి దక్కలేదని అక్కసుతో ….

ప్రేమించిన యువతి పెళ్ళి చెడకొట్టానన్న ఆత్మ క్షోభతో యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా దిబ్బపాలేనికి చెందిన దుల్ల రమేష్‌ (28) అనే వ్యక్తి ఐటీఐ పూర్తిచేసి పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. రమేష్ గతకొంత కాలంగా ఓ యువతి ప్రేమిస్తున్నాడు. ఆ యువతికి రఘు అనే యువకునితో వివాహం కుదిరింది. దీంతో ఆ యువతి మరొకరికి దక్కకూడదన్న అక్కసుతో ఆమె పెళ్లిని చెడగొట్టాడు. రమేష్‌.. రఘు వద్దకు వెళ్లి తాను ఆ యువతిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయి కూడా తనను ప్రేమిస్తోంది అని చెప్పడంతో రఘు ఆ యువతితో పెళ్లిని రద్దు చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొన్న పోలిసులు పూచీకత్తుపై విడుదల చేశారు. ఇంటికి చేరుకున్న రమేష్‌ మనస్తాపానికి గురై దువ్వాడ రైల్వేస్టేష్టన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నాడు. “నేను తప్పు చేశాను. నాది వన్‌సైడ్‌ లవ్‌.. ఆమెను దక్కించుకోడానికి తనపై అనవసర నిందలు వేశాను. రఘు ఆమెను పెళ్లి చేసుకోవాలని” కోరుతూ లేఖ రాశాడు.