జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుక సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ కోసం అమరులు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌ చేరుకున్న కేసీఆర్‌…అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ... Read more »

ఆ అంశాలపైనే ఫోకస్‌ చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్‌ తొలిసారి హైదరాబాద్‌లో గవర్నర్‌ సమక్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న జగన్‌ ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యేందుకు నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకోగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా... Read more »

ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైన తెలంగాణ రాష్ట్రం

ఇవాళ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. అన్ని జిల్లాల్లోనూ ఈ వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.. పబ్లిక్ గార్డెన్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు.. జిల్లాల్లో జరిగే ఉత్సవాలకు మంత్రులు హాజరవుతారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల... Read more »

ఉద్యోగులకు తీపి కబురు అందించిన కేసీఆర్ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏ పెరగనుంది. పెరిగిన డీఏ 2018 జులై 1వ తేదీ నుంచి... Read more »

కేసీఆర్‌ లొంగేది ఒక్క బీజేపీకి మాత్రమే : జీవన్‌ రెడ్డి

కేసీఆర్‌ లొంగేది ఒక్క బీజేపీకి మాత్రమేనంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత MLC జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. TRT క్వాలిఫైడ్‌ అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఇందిరాపార్కు దగ్గర ఆందోళనకు దిగిన అభ్యర్థులకు జీవన్‌ రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మద్దతు... Read more »

లవ్ జిహాద్ కలకలం.. హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాడని..

హైదరాబాద్ లో లవ్ జిహాద్ వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రేమ పేరుతో తమ అమ్మాయిని మోసం చేసి … మత మార్పిడి చేశారని పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించారు తల్లిదండ్రులు. రాత్రి అమ్మనాన్నను చూడాలని ఉందంటూ మెసేజ్ పంపిందని.. ఆ తర్వాత నుంచి తమ కూతురు... Read more »

జగిత్యాల కథ మళ్లీ మొదటికే వచ్చింది

చిన్న జిల్లాలతో మాత్రమే మంచి పరిపాలన సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ భావించేవారు. అలా ఏర్పాటైన జిల్లాల్లో జగిత్యాల ఒకటి. జిల్లాగా ఆవిర్భావం జరిగిందనే సంబరం తప్ప.. అభివృద్ధి అడుగు కూడా ముందుకు పడలేదు. నేతలు మారుతున్నారే తప్ప ప్రజల తలరాతలు మారడంలేదు. 40... Read more »

పోలీస్‌ పెట్రోల్ వాహనంలో నలుగురు యువకుల హల్‌చల్‌

పోలీస్‌ పెట్రోల్ వాహనంలో నలుగురు యువకులు హల్‌చల్‌ చేశారు. హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో సైరన్‌ వేసుకుంటూ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారు. దీంతో మిగతా వాహనదారులు ఉలిక్కిపడ్డారు. లా అండ్‌ ఆర్డర్‌ కోసం వినియోగించే పోలీస్‌ వాహనం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి.... Read more »

తెలంగాణలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నిన్నటిదాకా నిప్పుల కుంపటిని తలపించిన ఈ ప్రాంతం చిరు జల్లులతో చల్లబడిపోయింది. భారీ వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. Read more »

పెళ్లింట డీజే.. సౌండ్ పెంచమన్నందుకు.. దారుణంగా..

పెళ్లింట డీజే రౌడీలు ఎంటరయ్యారు. కర్రలు, రాడ్లతో దొరికినవారిని దొరికినట్టు చితక్కొట్టారు. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో జరిగిందీ దారుణం. పచ్చని పందిరి.. రక్తంతో తడిసిపోయింది. డీజే సౌండ్ పెంచమన్నందుకు గొడవ మొదలైంది. డీజే నిర్వాహకుడు తన స్నేహితులకు ఫోన్‌ చేశాడు. అల్లరి మూకల్ని రప్పించాడు.... Read more »