హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న కల్తీ గాళ్లు..

హైదరాబాద్ శివార్లలో కల్తీ గాళ్లు రెచ్చిపోతున్నారు. ఆహార పదార్ధాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. లాభపేక్షతో జనం ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. లక్షల రూపాయలను సొమ్ముచేసుకుంటున్నారు. భువనగిరి జిల్లా బీబీనగర్ లో కల్తీ పాలు తయారు చేస్తోన్న... Read more »

కార్మికుడ్ని మింగేసిన బల్దియా అధికారుల నిర్లక్ష్యం

బల్దియా అధికారుల నిర్లక్ష్యం ఔట్‌సోర్సింగ్‌ కార్మికుడ్ని మింగేసింది. ట్రాక్టర్‌తో మట్టిని డంప్‌ చేస్తుండగా సెప్టిక్‌ట్యాంక్‌ స్లాబ్‌ కూలిపోవడంతో వెంకటేష్‌ అనే కార్మికుడు మృతి చెందాడు. బండరాళ్లు, మట్టిలో కూరుకుపోయి నడుం దాకా విరిగిపోవడంతో ఊపిరాడక కన్నుమూశాడు. వెంకటేష్‌పైనే ఆధారపడ్డ కుటుంబ... Read more »

అర్ధరాత్రి ఆకాశంలో అరుదైన అత్యద్భుతం..

సంపూర్ణ చంద్రగ్రహణాన్ని హైదరాబాద్‌ వాసులు ఆసక్తిగా వీక్షించారు. ఖగోళంలో అద్భుతాన్ని వీక్షించేందుకు అర్ధరాత్రి బిర్లా ప్లానిటోరియానికి క్యూ కట్టారు. ఈ శతాబ్దిలోనే సుదీర్ఘమైన చంద్రగ్రహణం కావడంతో… ఈ ఛాన్స్‌ మిస్‌ కావొద్దంటూ పిల్లాపెద్దా తరలి వచ్చారు. ఎర్రగా మెరిసిపోయిన చంద్రుడితో... Read more »

తెలంగాణకు హరితహారం

రాను రాను తెలంగాణ‌లో అట‌వీ ప్రాంతం అంత‌రించుకుపోతుంది.అడ‌వుల నుండి కోతులు గ్రామాల్లోకి ప్ర‌వేశిస్తున్నాయి.స‌కాలంలో వ‌ర్షాలు లేక అన్న‌దాత‌లు కుదేల‌వుతున్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకుని స‌ర్కార్ తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం కార్య‌క్ర‌మం చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 33 శాతం ఉండాల్సిన అటవీ ప్రాంతం... Read more »

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ‌లోని ప‌రిశ్రమ‌ల‌న్నీ త‌ర‌లిపోతాయి : టీఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ప్రత్యేక హోదా అంశం చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. హోదాకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామంటూ కాంగ్రెస్ హైక‌మాండ్ చేసిన ప్రకటనను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది అధికార టీఆర్ఎస్. సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో ఏపీకి స్పెష‌ల్... Read more »

భర్తను చంపిన స్వాతికి బెయిల్ వచ్చినా.. ఏ దిక్కూ లేక చివరికిలా…

ప్రియుడు తో కలిసి భర్తను హత్య చేసి ఆపై భర్త ప్లేసులో ప్రియుడిని సెట్ చెయ్యాలనుకున్న స్వాతికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాగర్ కర్నూల్ మున్సిఫ్ కోర్టు. న్యాయసేవా సంస్థ తరపున స్వాతికి బెయిల్ ఇప్పించారు న్యాయవాది... Read more »

తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్ని మూతపడ్డాయి. తెలంగాణలో ప్రధాన ఆలయమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మూసివేశారు అర్చకులు. తిరిగి శనివారం ఉదయం ఐదు గంటలకు సంప్రోక్షణ, పుణ్య వచనం నిర్వహింస్తారు. తొమ్మిది గంటల నుంచి భక్తులను... Read more »

ముందస్తు ఎన్నికలు, మూడు కొత్త పథకాల పై..

తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికలు, ఆగస్టు 15న ప్రారంభించనునన్న మూడు కొత్త పథకాలు సహా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. 9 వేల 2 వందల గ్రామకార్యదర్శుల నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఆగస్టు 15న ప్రారంభించనున్న... Read more »

మజ్లిస్‌ కనుసన్నల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుస్తోంది

మజ్లిస్‌ కనుసన్నల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యేల ప్రాంతాల్లో మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని కిషన్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం అభివృద్ధిలో తిరోగమన దిశలో ఉందని విమర్శించారు. కానీ అభివృద్ధి నివేదికలో... Read more »

ఆలయంలో ఎలుకలు.. ఆందోళనలో భక్తులు

సికింద్రాబాద్‌ చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో ఎలుకలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.. పెద్ద సంఖ్యలో ఆలయంలో తిష్టవేసిన ఎలుకలు పెట్టిన నైవేద్యం పెట్టినట్టు లాగేసుకుపోతున్నాయి.. బోనాల జాతర సమీపిస్తున్నా ఆలయ పాలకమండలి ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం... Read more »