Aadhi Pinisetty: ఆది పినిశెట్టితో ఎంగేజ్‌మెంట్.. నిక్కీ గల్రానీ ఎమోషనల్ పోస్ట్..

Aadhi Pinisetty: ఆది పినిశెట్టితో ఎంగేజ్‌మెంట్.. నిక్కీ గల్రానీ ఎమోషనల్ పోస్ట్..
Aadhi Pinisetty: నిక్కీ గల్రానీ.. ఆది పినిశెట్టితో కలిసి రెండు సినిమాల్లో నటించింది.

Aadhi Pinisetty: సినీ పరిశ్రమలో ఏ ఇద్దరు నటీనటులు సన్నిహితంగా ఉన్నా.. వారు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్స్ మొదలయిపోతాయి. కానీ అందులో కొన్ని రూమర్స్ మాత్రం నిజమే అవుతాయి. తాజాగా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ప్రేమ, పెళ్లి గురించి రూమర్స్ నిజమే అని తేలిపోయింది. ఈ నెల 24న వీరిద్దరు సన్నిహితుల మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని వారు నేడు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు ఆది పినిశెట్టి. హీరోగా ఎప్పుడో పరిచయమయినా.. ఆది పినిశెట్టికి గుర్తింపు రావడానికి మాత్రం చాలా సమయమే పట్టింది. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు'లో ఆది చేసిన విలన్ పాత్ర తన కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటినుండి హీరోగా, విలన్‌గా సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు.

టాలీవుడ్, శాండిల్‌వుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. హీరోయిన్‌గా పరవాలేదనిపించుకుంది సంజనా గల్రానీ. ఆ తర్వాత తన చెల్లెలు నిక్కీ గల్రానీని హీరోయిన్‌గా పరిచయం చేసింది. అయితే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొంతకాలంలోనే దాదాపు అన్ని సౌత్ భాషలను చుట్టేసింది నిక్కీ. ఆదితో కలిసి రెండు సినిమాల్లో నటించింది. అప్పటినుండే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని సమాచారం.

ఆది, నిక్కీ మధ్య ప్రేమ అన్న రూమర్స్‌ను నిజం చేస్తూ.. ఈ జంట వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి తోడు ఓ ఎమోషనల్ నోట్‌ను కూడా జతచేర్చింది నిక్కీ. 'ఒకరికి ఒకరు జీవితాంతం కలిసుండడమే జీవితంలో బెస్ట్ థింగ్. మేము ఒకరినొకరం ఎన్నో సంవత్సరాల క్రితమే కలుసుకున్నాం కానీ ఇప్పుడు ఇది అఫీషియల్ అయిపోయింది. 2022 మార్చి 24 మాకు చాలా స్పెషల్. ఇరు కుటుంబాల సమక్షంలో మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ కొత్త ప్రయాణానికి మీ ప్రేమ, ఆశీస్సులు కోరుకుంటున్నాం.' అంటూ నిక్కీ ట్వీట్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story