Acharya Story: 'ఆచార్య' కథ ఇదే..! సోషల్ మీడియాలో స్టోరీ వైరల్..

Acharya Story: ఆచార్య కథ ఇదే..! సోషల్ మీడియాలో స్టోరీ వైరల్..
Acharya Story: ఆచార్య కథ ధర్మస్థలి అనే పుణ్యక్షేత్రం చుట్టూ తిరుగుతుందని ట్రైలర్‌లో స్పష్టంగా చూపించారు.

Acharya Story: మల్టీ స్టారర్ సినిమాలంటే ప్రేక్షకులు ప్రత్యేకంగా ఆదరిస్తారు. అదే మెగా ఫ్యామిలీలో ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేస్తే.. ఇంక ఆ సినిమాపై ఏర్పడే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే రామ్ చరణ్, చిరంజీవి మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన 'ఆచార్య'పై అంచనాలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. అయితే తాజాగా ఆచార్య కథ ఇదే అంటూ ఓ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

గతేడాది విడుదల కావాల్సిన ఆచార్య.. ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది. అందుకే తాజాగా ఆచార్య ట్రైలర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. అయితే ఈ ట్రైలర్‌ను బట్టే కొందరు ఆచార్య కథ ఇదే అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమాలో చిరంజీవి ఆచార్యగా, రామ్ చరణ్ సిద్ధగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే.


ఆచార్య కథ ధర్మస్థలి అనే పుణ్యక్షేత్రం చుట్టూ తిరుగుతుందని ట్రైలర్‌లో స్పష్టంగా చూపించారు. అయితే ధర్మస్థలిలో జీవనం కొనసాగించే సిద్ధ.. అక్కడ ఎవరికి ఆపద వచ్చిన వారి వెన్నంటే ఉంటాడు. కానీ హఠాత్తుగా ఒకరోజు సిద్ధ ఎవరికీ చెప్పకుండా కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆచార్య అక్కడికి వచ్చి సిద్ధ స్థానాన్ని తాను తీసుకొని ఆ ఊరి ప్రజలను కాపాడుకుంటాడు. ఇదే ఆచార్య కథ అని ప్రచారం.

అయితే ట్రైలర్‌లో చూపించినదాని ప్రకారం ధర్మస్థలిలో ఆచార్య ఉన్నప్పుడు సిద్ధ ఉండడు. ఆచార్య, సిద్ధ ఇద్దరూ కామ్రేడ్‌లుగా కనిపించినప్పుడు మాత్రమే కలిసి ఉంటారు. అయితే సిద్ధ అనుకోకుండా ఎందుకు కనిపించకుండా పోతాడు. ఆచార్య నక్సలిజంను వదిలేసి ధర్మస్థలికి ఎందుకు వస్తాడు అనేది సినిమాలోని మెయిన్ ప్లాట్ అయ్యిండవచ్చని సమాచారం. అయితే కొరటాల శివ ఇతర సినిమాలలాగానే ఆచార్యలో కూడా ఓ సోషల్ మెసేజ్ ఉంటుందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story