Prakash Raj : ఆ టైంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను : ప్రకాష్ రాజ్

Prakash Raj : ఆ టైంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను : ప్రకాష్ రాజ్
Prakash Raj : ప్రకాష్ రాజ్ నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమార్తెలు మేఘన, పూజ, కుమారుడు సిద్దు పుట్టారు.

Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఓ టైంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట .. ఈ విషయాన్ని ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా.. ప్రకాష్ రాజ్ తన జీవితంలోని కొన్ని భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు.. తన జీవితంలో ఒకానొక సమయంలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానో ఈ సందర్భంగా వెల్లడించారు.

ప్రకాష్ రాజ్ నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమార్తెలు మేఘన, పూజ, కుమారుడు సిద్దు పుట్టారు. కానీ 2004లో సిద్దు మరణించారు. ఆ తర్వాత కొన్ని విభేదాల కారణంగా ప్రకాష్ రాజ్, లలిత కుమారి 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ప్రకాష్ రాజ్ డాన్స్ మాస్టర్ పోనీ వర్మను 2010లో వివాహం చేసుకున్నాడు.. వీరి ప్రేమకి గుర్తుగా 2015లో వేదాంత్ అనే కుమారుడు పుట్టాడు..

అయితే తన మొదటి కుమారుడు సిద్దు.. తన ఫామ్‌హౌస్‌లో 5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు భవనంపై నుండి జారిపడి మరణించాడని ప్రకాష్ రాజ్ తెలిపారు. తలకు గట్టిగా దెబ్బ తగిలిందని.. ఎంత ప్రయత్నించినా బాబును కాపాడలేకపోయానని అన్నారు. ఆ సమయంలో తనకు ప్రపంచం వద్దనిపించిందని దీనితో తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

కానీ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని నిర్ణయించుకొని ఆత్మహత్యను ఉపసంహరించుకున్నానని తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story