Indraja : లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇంద్రజ.. స్టార్ హీరో సినిమాలో కీ రోల్..!

Indraja : లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఇంద్రజ.. స్టార్ హీరో సినిమాలో కీ రోల్..!
Indraja : సినీ హీరోయిన్లు ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.. స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు..

Indraja : సినీ హీరోయిన్లు ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.. స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు.. ఇటీవల రాధేశ్యామ్ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ రీ ఎంట్రీ ఇచ్చి ఆదరగోట్టింది. ఇప్పుడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ మళ్ళీ సినిమాల్లో బిజీ కానుంది.

శతమానంభవతి మూవీతో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేయలేదు.. కానీ టీవీ షోలలో మాత్రం బిజీ అయిపొయింది. ఇప్పుడు ఆమె లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప పార్ట్ 2 లో ఆమెని ఓ కీలక పాత్రకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

సుకుమార్ స్వయంగా ఆమెని కలిశారని టాక్ నడుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన త్వరలోనే రానుంది. ఒకవేళ ఇదే నిజం అయితే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవడం ఖాయమని చెప్పాలి. రష్మిక మందన్నా హీరోయిన్‌‌గా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప పార్ట్ వన్ సూపర్ సక్సెస్ కావడంతో పార్ట్ 2 పైన భారీ అంచనాలున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story