Sreeleela : నవీన్ పోలిశెట్టితో పెళ్లిసందడి బ్యూటీ.. !
Sreeleela : శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది శ్రీలీల.. మొదటి సినిమాతోనే అటు గ్లామర్ షోతోనూ, ఇటు యాక్టింగ్ తో అదరగొట్టి మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ.. ఇప్పుడీ అమ్ముడుకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే నవీన్ పోలిశెట్టి హీరోగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో 'అనగనగా ఒక రాజు' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం చాలా ఫన్నీగా ఉంటోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలని మేకర్స్ ఎంపిక చేసినట్టుగా సమాచారం. దీనిపైన త్వరలోనే అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక రవితేజ హీరోగా త్రీనాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్‌గా ఎంపిక అయినట్టు సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com