Sridevi: అందాల తార శ్రీదేవి.. ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందో తెలుసా!!

Sridevi: అందాల తార శ్రీదేవి.. ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందో తెలుసా!!
Sridevi: అందం, అభినయం శ్రీదేవికి దేవుడిచ్చిన వరం.. కానీ వయసుతో పాటు అందం తరగిపోతుంది.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది ఈ అతిలోక సుందరి..

Sridevi: అందానికి ప్రతిరూపం శ్రీదేవి. 4 సంవత్సరాల వయస్సులో తన నటనా జీవితాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాల పాటు సినిమా ప్రేక్షకులను అలరించింది. అందం, అభినయం శ్రీదేవికి దేవుడిచ్చిన వరం.. కానీ వయసుతో పాటు అందం తరగిపోతుంది.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది ఈ అతిలోక సుందరి.. తాను ఎంచుకున్న రంగం కూడా గ్లామర్ ఫీల్డ్ కావడంతో వయసుతో పాటు వచ్చిన మార్పులను అంగీకరించలేక అనేక సర్జరీలు చేయించుకుంది.. అవి కూడా ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు.


ఈరోజు బాలీవుడ్ తొలి మహిళా సూపర్ స్టార్ శ్రీదేవి నాలుగో వర్ధంతి. 54 ఏళ్ల వయసులో, శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగి మరణించారు. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం శ్రీదేవి దాదాపు 29 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుందని. శ్రీదేవి యవ్వనంగా కనిపించడం కోసం తరచూ సర్జరీలు చేయించుకునేవారు. మరణానికి కొంతకాలం ముందు ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఏడేళ్ల క్రితం శ్రీదేవిని కలిసినప్పుడు ఆమె అందాన్ని చూసి ముగ్ధురాలిని అయ్యానని ఓ సీనియర్ జర్నలిస్టు తెలిపారు.


నిజానికి నాలుగు పదుల వయసులో కూడా ఆమె బరువు చాలా తక్కువగా ఉండడంతో పాటు ముఖంలో ఒక్క ముడత కూడా లేదు. అయితే ఇదంతా కాస్మెటిక్ సర్జరీ వల్లే జరిగింది. శ్రీదేవి తన అందం విషయంలో చాలా కాన్షియస్‌గా ఉండేదని అంటున్నారు. అంతేకాదు శ్రీదేవి అందం చెక్కుచెదరకుండా ఉండేందుకు చాలా ట్రీట్ మెంట్స్ తీసుకునేది. ఆమె తన ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషీలకు కూడా సర్జరీలు చేయించినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.


శ్రీదేవి చికిత్స కోసం USలోని సౌత్ కరోలినాకు తరచుగా వెళ్తుండేవారు. ఆమె చేయించుకున్న సర్జరీల్లో ఒకటి సక్సెస్ అవలేదు. దాని కారణంగానే ఆమె పెదవుల ఆకృతి దెబ్బతిందని అంటారు. శస్త్రచికిత్స విఫలం కావడంతో, సౌత్ కరోలినాలోని డాక్టర్ ఆమెకు డైట్ పిల్స్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. వీటితో పాటు యాంటీ ఏజింగ్ మందులు కూడా వేసుకునేది.


అందుకే ఆహారం తక్కువగా తీసుకునేవారని తెలుస్తోంది. శ్రీదేవికి లేజర్ స్కిన్ సర్జరీ, సిలికాన్ బ్రెస్ట్ కరెక్షన్, బోటాక్స్, ఆక్సీ పీల్ ఫేస్‌లిఫ్ట్ అప్స్, బాడీ టకింగ్ జరిగింది. శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తగ్గించడానికి కూడా ఆమె చికిత్స చేయించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story