Sudha : నా భర్త, కొడుక్కి అలాంటి పరిస్థితే వస్తుంది.. నటి సుధ ఎమోషనల్..!

Sudha : నా భర్త, కొడుక్కి అలాంటి పరిస్థితే వస్తుంది.. నటి సుధ ఎమోషనల్..!
Sudha : సినీ నటి సుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తల్లి పాత్రలు అంటే టక్కున ఆమె గుర్తుకువస్తారు..

Sudha : సినీ నటి సుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తల్లి పాత్రలు అంటే టక్కున ఆమె గుర్తుకువస్తారు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఏకంగా 975 సినిమాల్లో నటించి మెప్పించారామే.. వృత్తిపరంగా సజావుగానే ఉన్న వ్యక్తిగతంగా మాత్రం అమె ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నారట.

ఇండస్ట్రీలో చాలా రకాల పాత్రలు పోషించి బాగానే సంపాదించానని, కానీ వచ్చిన డబ్బును బిజినెస్ లలో పెట్టి పోగొట్టుకున్నానని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఓ హోటల్ పెడితే మంచి లాభం వచ్చిందని, అప్పుడు మరో హోటల్ పెడితే పూర్తిగా నష్టపోయానని అన్నారు.. ఇక చిన్నప్పుడు అమ్మ హార్ట్ ఎటాక్‌‌తో చనిపోయిందని, కొడుకులున్నా తన తండ్రికి సపోర్ట్‌‌గా లేకపోవడంతో ఆయన బాగోగులన్ని తానే చూసుకున్నట్టుగా వెల్లడించారు. అయితే తన తండ్రికి బాగానే ఆస్తులున్నాయని, కానీ ఆయనకి క్యాన్సర్ రావడంతో అవన్ని కరిగిపోయాయని తెలిపింది.. ఆ సమయంలోనే తనను దూరం ఉంచారని, వాటినుంచి తాను ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని వెల్లడించింది.

ఇక తన భర్త, కొడుకులు తనకి దూరంగా యూఎస్‌‌లో ఉంటున్నారని తెలిపింది. కానీ వాళ్లకూ తన లాంటి పరిస్థితే వస్తుందని..మాతృదేవోభవ సినిమాలోని చాలా సంఘటనలు తన నిజ జీవితంలో జరిగినవే అంటూ ఎమోషనల్ అయ్యారు సుధ. అయితే ఈరోజు తాను నాన్న లేక ఒంటరయ్యానని ఏడుస్తున్నాను తప్పితే.. తన పిల్లలు కోసం, తన భర్త కోసం ఏడ్వడం లేదని చెప్పుకొచ్చింది. తమిళనాడులోని శ్రీరంగంలో పుట్టి పెరిగారు సుధ.. దర్శకుడు బాలచందర్‌ ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు. స్వతహాగా అమె తమిళ్ అయినప్పటికీ నటుడు అల్లు రామలింగయ్య సలహాతో తెలుగు బాగా నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story