Major Trailer: అడివి శేష్‌ 'మేజర్‌' ట్రైలర్‌ వచ్చేసింది...!

Major Trailer:  అడివి శేష్‌ మేజర్‌ ట్రైలర్‌ వచ్చేసింది...!
Major Trailer : 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ 'మేజర్'.

Major Trailer : 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కిన పాన్‌ ఇండియా మూవీ 'మేజర్'.. అడవి శేషు మెయిన్ లీడ్ లో నటిస్తోన్న ఈ సినిమాకి శశికిరణ్ దర్శకత్వం వహించారు..శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 3 న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఒక్కో భాషలో ఒక్కో స్టార్‌ హీరో ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్‌, మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం, ఉగ్రవాదులతో పోరాటం తదితర సంఘటలను ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపించింది. ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్స్, అడివి శేష్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి.

ఆద్యంతం ఆకట్టుకున్న చిత్ర ట్రైలర్ సినిమా పైన మరిన్ని అంచనాలను పెంచేసింది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.



Tags

Read MoreRead Less
Next Story