Alia Bhatt : రాజమౌళి పై అలక.. ఆ వార్తలను కొట్టిపారేసిన అలియా..!

Alia Bhatt : రాజమౌళి పై అలక.. ఆ వార్తలను కొట్టిపారేసిన అలియా..!
Alia Bhatt : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌‌లో వచ్చిన RRR మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే..

Alia Bhatt : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌‌లో వచ్చిన RRR మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ సరసన సీత అనే పాత్రలో నటించింది. సినిమాలో ఆమెకి ఉన్న స్కోప్ చిన్నదే అయినప్పటికీ మంచి పెర్ఫార్మెన్ ఇచ్చింది. అయితే అలియాభట్ దర్శకుడు రాజమౌళి పైన అలిగిందని.. అందుకే RRR సినిమాకి సంబంధించిన పోస్ట్ లతో పాటుగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి రాజమౌళిని అన్ ఫాలో చేసిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలను అలియా స్వయంగా కొట్టిపారేసింది.

"ఆర్‌ఆర్‌ఆర్‌'లాంటి గొప్ప చిత్రంలో నటించడం ఎంతో సంతోషంగా ఉంది.. . సీత పాత్రని చాలా ప్రేమతో చేశాను. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా.. ఈ సినిమా విషయంలో ప్రతిది చాలా సంతోషంగా ఉన్నాను. రాజమౌళితో పాటు ఆయన టీమ్‌ అంతా ఈ సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డారు. వారి శక్తినంతా ధారబోసి ఓ మంచి చిత్రాన్ని అందించారు. ఇలాంటి గొప్ప చిత్రం పట్ల తప్పుడు విషయాలను ప్రచారం చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. అందుకే ఈ వివరణ ఇస్తున్నాను" అని పేర్కొంది. కాగా రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన RRR మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.


స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ జీవిత కథలను తీసుకొని దానికి కల్పిత కథ జోడించి RRR సినిమాను తెరకెక్కించారు జక్కన్న.. ఇందులో రామ్ చరణ్ సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించారు..డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించగా, కీరవాణి సంగీతం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story