Alia Bhatt-Ranbir Kapoor : పెళ్లికి వేళాయే.. ముహూర్తం ఫిక్స్..

Alia Bhatt-Ranbir Kapoor : పెళ్లికి వేళాయే.. ముహూర్తం ఫిక్స్..
Alia Bhatt-Ranbir Kapoor : బాలీవుడ్ బ్యూటీఫుల్ పెయిర్ పెళ్లిపీటలు ఎక్కనున్నారు..

Alia Bhatt-Ranbir Kapoor : గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అలియా, రణబీర్ పెళ్లి చేసుకోబోతున్నాం అని ప్రకటించినప్పటినుండి అభిమానులు ఆ డేట్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

పెళ్లి ఘడియ రానే వచ్చింది. రణబీర్ కపూర్, అలియా భట్ ల పెళ్లి తేదీ ఏప్రిల్ 17న వెల్లడైంది.. జాతీయ మీడియా సమాచారం ప్రకారం ఈనెల 13వ తేదీ నుంచి పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 17న పెళ్లి ముహూర్తి ఫిక్స్ అయిందని సమాచారం. రణబీర్, అలియా వారి వివాహ తేదీకి సంబంధించిన సమాచారం మాత్రం ఇప్పటివరకు ఎక్కడా ప్రకటించలేదు.

ఇప్పటి వరకు ఈ జంట నుంచి పెళ్లిపై ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. అయితే వీటన్నింటి మధ్య రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒక ప్రముఖ వెబ్‌సైట్‌ కథనం ప్రకారం అలియా, రణబీర్‌ల వివాహం చెంబూర్‌లోని ఆర్‌కె బంగ్లాలో జరగనుందని తెలుస్తోంది. వివాహానికి సంబంధించిన ఆచారాలు 3 రోజుల ముందు నుంచే ప్రారంభం కానున్నాయి. ఇద్దరూ పంజాబీ సంప్రదాయంలో వివాహం చేసుకోనున్నారు.

ఈ జంట వివాహం చాలా విలాసవంతమైన ఆర్కే బంగ్లాలో జరగనుంది. ఈ బంగ్లాలో పెద్ద లాన్ ఉంది. పెళ్లికి హాజరయ్యే స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందని ఇరువురి కుటుంబసభ్యులు భావించారట. అయితే పెళ్లికి ఎవరినీ ఆహ్వానించలేదని కూడా నివేదికలు వస్తున్నాయి. అయితే ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story