Alia Bhatt : ఎన్టీఆర్‌‌తో అలియా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..!

Alia Bhatt : ఎన్టీఆర్‌‌తో అలియా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..!
Alia Bhatt : జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌‌లో ఓ సినిమా వస్తోంది. ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది.

Alia Bhatt : జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌‌లో ఓ సినిమా వస్తోంది. ఎన్టీఆర్ 30వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో ముందునుంచి హీరోయిన్‌‌గా అలియా భట్ నటిస్తోందన్న ప్రచారం నడుస్తోంది. దీనిపైన తాజాగా క్లారిటీ ఇచ్చింది అలియా... ఎన్టీఆర్ 30 వ సినిమా కోసం తనని సంప్రదించారని, కొరటాల శివ స్టొరీ చెప్పగానే ఇంకో ఆలోచన లేకుండా సినిమాకి సైన్ చేశానని, మా కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్‌‌తో నటించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నానని తెలిపింది. స్టూడెంట్ లీడర్‌‌గా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తు్న్నాడు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి. .ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది

Tags

Read MoreRead Less
Next Story