Movie Ticket Price: 'ఆర్ఆర్ఆర్' అంటే ఓకే..! 'బీస్ట్', 'కేజీఎఫ్ 2'కు కూడా అదే రూలా..?

Movie Ticket Price: ఆర్ఆర్ఆర్ అంటే ఓకే..! బీస్ట్, కేజీఎఫ్ 2కు కూడా అదే రూలా..?
Movie Ticket Price: ఆర్ఆర్ఆర్ తర్వాత బీస్ట్, కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

Movie Ticket Price: సినిమా టికెట్ రేట్ల అంశం కొంతకాలం వరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ కొత్త సినిమా విడుదలయినా దానికి టికెట్ రేట్లు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉంటే.. తెలంగాణ పరిస్థితి మరొకలా ఉంది. టికెట్ల రేట్లు అమాంతం పెంచి ప్రేక్షకులను సినిమా చూడాలంటే ఆలోచనలో పడేలా చేస్తున్నారు.

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవచ్చని థియేటర్లకు ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. దీంతో మల్టీప్లెక్స్‌లు దాదాపు రూ. 440 రేట్లతో అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ఇది తెలుగు సినిమా కావడంతో.. రాజమౌళిలాంటి దర్శకుడు తెరకెక్కించిన చిత్రం కావడంతో ఈ రేట్లు తప్పవేమో అనుకుంటూనే ప్రేక్షకులు సినిమా చూసి కలెక్షన్ల వర్షం కురిపించారు. కానీ డబ్బింగ్ సినిమాలకు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత బీస్ట్, కేజీఎఫ్ 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలకు కూడా టికెట్ రేట్లు ఆకాశన్నంటడంతో ప్రేక్షకులు కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా అయితే మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర రూ.150 ఉండాలి. కానీ బీస్ట్ కోసం రూ.295కు పెరిగింది. సింగిల్ స్క్రీన్స్‌లో కూడా ధర రూ.170గా ఉంది.

పాన్ ఇండియా చిత్రం కాబట్టి ఆ మాత్రం రేట్లు కామన్ అనుకున్నా కూడా హైదరాబాద్‌తో పోలీస్తే బీస్ట్ సినిమా టికెట్ ధర చెన్నైలోనే తక్కువగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇక కేజీఎఫ్ 2 కోసం కూడా టికెట్ ధరలు పెంచితే కానీ విడుదలకు ఒప్పుకోమంటూ మూవీ టీమ్.. దగ్గరుండి ధరలు పెరిగేలా చూసుకుంది. అయితే దీనిపై దర్శకుడు బండి సరోజ్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని కూడా పెట్టారు.



Tags

Read MoreRead Less
Next Story