Allu Arjun_Dhanush : బన్నీ, ధనుష్‌‌ కాంబోతో క్రేజీ డైరెక్టర్..!

Allu Arjun_Dhanush :  బన్నీ, ధనుష్‌‌ కాంబోతో క్రేజీ డైరెక్టర్..!
Allu Arjun_Dhanush : టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్‌‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ మధ్యే ఎన్టీఆర్, చరణ్‌‌ల కాంబోని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

Allu Arjun_Dhanush : టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్‌‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ మధ్యే ఎన్టీఆర్, చరణ్‌‌ల కాంబోని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు రాజమౌళి.. దాని రిజల్ట్ ఎలా ఉందొ అందరికీ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మరో సరికొత్త కాంబో గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అదే అల్లు అర్జున్, ధనుష్.

వీరిద్దరిని కలిపి ఓ సినిమా చేసేందుకు దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య మూవీని ఫినిష్ చేసిన కొరటాల... ఎన్టీఆర్ మూవీ పైన ఫోకస్ చేస్తున్నాడు. ఈ మూవీ అయిపోయాక బన్నీ, ధనుష్ మూవీని చేస్తాడన్న టాక్ బలంగా నడుస్తోంది. అటు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నాడు.

దీని తర్వాత మరే మూవీకి కూడా ఫిక్స్ అవ్వలేదు. అటు ధనుష్ కూడా తెలుగులో ఓ స్ట్రెయిట్ ఫిలిం చేస్తున్నాడు. 2023లోపు ఈ ముగ్గురు ఫ్రీ అవ్వనున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ పైన ఓ క్లారిటీ రానుంది. బన్నీ, ధనుష్ ఇద్దరు ఖతర్నాక్ యాక్టర్స్ కావడం, మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు కొరటాల దర్శకుడు కావడంతో ఈ కాంబో పైన ఇండస్ట్రీలో అయితే మంచి బజ్ ఉంది.

Tags

Read MoreRead Less
Next Story