Allu Arha: అల్లు అర్హ డ్యాన్స్.. వీడియో వైరల్

Allu Arha: అల్లు అర్హ డ్యాన్స్.. వీడియో వైరల్
Allu Arha: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ ల వైరల్ అవుతోంది

Allu Arha : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్ ల వైరల్ అవుతోంది. అర్హ చదువుతున్న స్కూల్ గ్రాడ్యుయేషన్ డే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిల్లలందరూ ముద్దుగా డ్యాన్స్ చేస్తూ తమ క్యూట్ స్టెప్పులతో అలరించారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బన్నీ భార్య స్నేహా రెడ్డి తన కూతురు డ్యాన్స్ చేసిన వీడియోని పోస్ట్ చేశారు. స్టార్ హీరోల చిన్నారులు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. అర్హ కూడా సమంత నటించిన శాకుంతలంలో కనిపించనుంది.

సినిమాలు, షూటింగ్స్ తో ఎంత బిజీ ఉన్నా బన్నీ పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తాడు. పుష్పతో హిట్ కొట్టిన అర్జున్ పుష్ప2కి రెడీ అయిపోతున్నాడు. త్వరగా ఈ సినిమాని కంప్లీట్ చేయాలని ఇప్పటికే దర్శకుడు సుమకుమాార్ కి ఆర్డర్స్ కూడా పాస్ చేశాడు అల్లు అర్జున్.

మహేష్ బాబు కూతురు సితార కూడా తండ్రి నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో పెన్పీ డ్యాన్సుకు స్టెప్పులేసింది. తండ్రిని మించిన తనయులు అయిపోతున్నారు. అటు చదువులోనూ, ఇటు తమకు అభిరుచి ఉన్న రంగాల్లోనూ కనిపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story