Allu Arjun: రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన అల్లు అర్జున్ అయిదు సినిమాలు ఇవే..

Allu Arjun (tv5news.in)

Allu Arjun (tv5news.in)

Allu Arjun: కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు అల్లు అర్జున్

Allu Arjun: మెగా హీరోలు అందరికీ ప్రస్తుతం ప్రేక్షకుల్లో చాలా పాపులారిటీ ఉంది. కానీ వారందరికంటే ముందు హీరోగా, మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. 'గంగోత్రి'తో హీరోగా పరిచయమయినా కూడా అప్పటికీ తనను పెద్దగా ఎవరూ ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితి నుండి నేడు స్టైలిష్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్‌లో అల్లు అర్జున్ నటించిన అయిుదు సినిమాలు ఉండడం విశేషం.

మొదటి సినిమాలో అల్లు అర్జున్ పెద్దగా ఎవ్వరికీ నచ్చకపోయినా.. రెండో సినిమా 'ఆర్య' నుండే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు బన్నీ. ఆర్యలాంటి ప్రేమకథను అప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఎవరూ చూడలేదు. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ ప్రేమకథ అటు డైరెక్టర్‌గా సుకుమార్‌కు, ఇటు హీరోగా అల్లు అర్జున్‌కు ఒకేసారి స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.


కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. ఎంతోమందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు అల్లు అర్జున్. సినిమా, సినిమాకు తనను తాను మార్చుకుంటూ స్టైల్ గోల్స్‌ను తెలియజేస్తూ.. స్టైలిష్ స్టార్‌గా మారిపోయాడు. ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చి మొదటిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా 'రేసుగుర్రం'. ఆ తర్వాత కూడా వెంటవెంటనే బన్నీ సినిమాలు కొన్ని 100 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టాయి.

రేసుగుర్రం తర్వాత 'డీజే', 'సరైనోడు', 'అల వైకుంఠపురం'లో చిత్రాలు కూడా అల్లు అర్జున్‌ను 100 కోట్ల హీరోగా నిలబెట్టాయి. అయితే వాటన్నింటికి మించి ఇటీవల విడుదలయిన 'పుష్ప' సినిమా తనను పాన్ ఇండియా స్టా్ర్‌గా మార్చేసింది. బాలీవుడ్‌లో అయితే పుష్ప మ్యానియా చాలాకాలమే కొనసాగింది. శుక్రవారం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప పార్ట్ 2 నుండి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story