Allu Arjun: అల్లు అర్జున్ చేతిలో ఆరు క్రేజీ ప్రాజెక్ట్స్.. అవేంటంటే..

Allu Arjun (tv5news.in)

Allu Arjun (tv5news.in)

Allu Arjun: వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్‌తో కలిసి ‘ఐకాన్’ అనే సినిమాను చేయాల్సి ఉంది అల్లు అర్జున్.

Allu Arjun: 'పుష్ప' ఇచ్చిన హిట్‌తో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు అల్లు అర్జున్. అందుకే తనపై అన్ని పరిశ్రమల చూపు ఉంది. వేరే భాషల డైరెక్టర్లు కూడా అల్లు అర్జున్‌తో పనిచేయాలని కోరుకుంటున్నారు. అయితే ఇదే ఫార్మ్‌లో అల్లు అర్జున్ ఏకంగా అరడజను ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.

గతేడాది 'పుష్ప ది రైజ్'తో హిట్ కొట్టాడు అల్లు అర్జున్. కానీ అది కేవలం బిగినింగ్ మాత్రమే అన్నాడు దర్శకుడు సుకుమార్. పుష్ప రెండో భాగం 'పుష్ప ది రూల్' అంతకు మించి ఉంటుందని ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాడు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. సుకుమార్ మాత్రమే కాకుండా మరో అయిదుగురు స్టార్ డైరెక్టర్లు కూడా బన్నీ అప్‌కమింగ్ సినిమాల లిస్ట్‌లో ఉన్నారు.

వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్‌తో కలిసి 'ఐకాన్' అనే సినిమాను చేయాల్సి ఉంది అల్లు అర్జున్. కానీ మూవీ అనౌన్స్‌మెంట్ తప్పా ఇంకా దీని గురించి ఏ అప్డేట్ లేదు. కానీ ఈ సినిమా క్యాన్సిల్ అవ్వలేదని త్వరలోనే ప్రారంభం కానుందని మూవీ టీమ్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తూనే ఉంది. తమిళ దర్శకుడు మురుగదాస్‌తో కూడా ఓ మూవీ ప్రారంభించాడు బన్నీ. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో రానున్న సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇవి మాత్రమే కాకుండా అల్లు అరవింద్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా బన్నీ ఓ మూవీ చేయనున్నాడు. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కూడా ఓ చిత్రం తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో సరైనోడు లాంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. వీరితో పాటు శాండిల్‌వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ.

Tags

Read MoreRead Less
Next Story