Allu Arjun : పుష్ప సక్సెస్... భారీ రెమ్యునరేషన్‌‌కు బన్నీ డిమాండ్..!

Allu Arjun :  పుష్ప సక్సెస్... భారీ రెమ్యునరేషన్‌‌కు బన్నీ డిమాండ్..!
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌‌‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌‌‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప.. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌‌గా నటించింది. సినిమాకి ముందునుంచి మంచి టాక్ రావడంతో వసూళ్ళ పరంగా సినిమా రికార్డులు సృష్టించింది.

ముఖ్యంగా హిందీలో ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పుష్ప మూవీ ఇచ్చిన కిక్కుతో మరో పాన్ ఇండియా మూవీ చేసేందుకు అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యాడట.. స్టార్ డైరెక్టర్లు బన్నీతో పాన్ ఇండియా మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌లో బన్నీ ఓ సినిమాకి చేసేందుకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.75 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్టుగా ఫిలిం సర్కిల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

అందుకు లైకా ప్రొడక్షన్స్‌ కూడా ఒకే చెప్పినట్టుగా సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే ప్రభాస్ తర్వాత అంతటి రెమ్యునరేషన్ తీసుకున్న టాలీవుడ్ హీరో బన్నీనే అవుతాడు. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కోలీవుడ్‌ దర్శకులు అట్లీ, మురుగదాస్‌ల్లో ఒకరు దర్శకత్వం వహించే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story