Anasuya Bharadwaj : అనసూయ మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా?

Anasuya Bharadwaj : అనసూయ మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా?
Anasuya Bharadwaj : జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటిని సంపాదించింది స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్.

Anasuya Bharadwaj : జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటిని సంపాదించింది స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్. తన అందచందాలతో కొద్దికాలంలోనే తెలుగులో టాప్ యాంకర్‌‌గా మారిపాయింది. అటు యాంకర్‌‌గా బిజీగా ఉంటూనే ఇటు సినిమాల్లో కూడా నటిస్తుంది.. ఇటీవలె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో నటించి మెప్పించింది అనసూయ.. ఇక సోషల్ మీడియాలో కూడా అనసూయ ఫుల్ యాక్టివ్‌‌గా ఉంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహిం‍చిన అనసూయ... ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో భాగంగానే అనసూయకి ఓ నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని అక్కా అని పిలవాలా లేదా ఆంటీ అని పిలవాలా అని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. దీనికి అనసూయ స్పందిస్తూ.. 'ఏదీ వద్దు. అలా పిలిచే అంత స్నేహం మన మధ్య లేదు. ఇలా పిలుస్తామని అనడం మీ పెంపకాన్ని ( అప్‌ బ్రింగింగ్‌) ప్రశ్నిస్తుంది. ఇది ఏజ్‌ షేమింగ్‌ చేసినట్లే. గౌరవం ఇవ్వండి' అంటూ సమాధానం ఇచ్చింది.


అనసూయ సమాధానంకి మరో నెటిజన్ స్పందించాడు.. 'ఎవరినైనా అక్కా అని పిలిచినంత మాత్రానా ఏజ్‌ షేమింగ్‌ అవ్వదు. అలాంటప్పుడు ప్రశంసలు కూడా తీసుకోవద్దు' అంటూ సదరు నెటిజన్‌ ప్రశ్నించాడు. దీనిపైన అనసూయ స్పందిస్తూ.. 'అయ్యుండొచ్చు. కానీ ఏ ఉద్దేశంతో పిలుస్తున్నారన్నది ముఖ్యం ఇక్కడ. అయినా కాంప్లిమెంట్స్‌(ప్రశంసలు) తీసుకోవాలా వద్దా అన్నది వాళ్ల ఇష్టం కదా' అంటూ రిప్లయ్ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story