Apsara Rani: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్‌కు రమ్మన్నాడు.. ఎందుకంటే..: అప్సర రాణి

Apsara Rani (tv5news.in)

Apsara Rani (tv5news.in)

Apsara Rani: అయితే ఆ సినిమా స్టోరీ డిస్కషన్ కోసం డైరెక్టర్ ఒంటరిగా రూమ్‌కు రమ్మన్నాడన్న విషయం బయటపెట్టింది ఈ భామ.

Apsara Rani: అప్సర రాణి.. రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్‌కు పరిచయం ఎంతోమంది హాట్ బ్యూటీలలో తాను కూడా ఒకరు. కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి వచ్చిన అప్సరకు టాలీవుడ్ గ్రాండ్ వెల్‌కమ్ ఇచ్చింది. ఒక ఐటెమ్ సాంగ్స్‌తో, సినిమాలతో ప్రస్తుతం ఇక్కడే సెటిల్ అయిపోయింది ఈ భామ. అయితే తాజాగా అప్సర.. తన లైఫ్‌లోని క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.

క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఎంతోమంది నటీమణుల జీవితాలు అర్థాంతరంగా ఆగిపోయాయి. అయినా కూడా చాలామంది ఈ క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. కానీ మీటూ అనే మూమెంట్ వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చాలామంది క్యాస్టింగ్ కౌచ్ తాము ఏ విధంగా నష్టపోయారో బయటపెట్టారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి చేరింది అప్సర రాణి.

కన్నడలో ఓ సినిమాలో అప్సరకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందట. అయితే ఆ సినిమా స్టోరీ డిస్కషన్ కోసం డైరెక్టర్ ఒంటరిగా రూమ్‌కు రమ్మన్నాడన్న విషయం బయటపెట్టింది ఈ భామ. తీరా అక్కడికి వెళ్లాక తన కోరిక తీరిస్తేనే హీరోయిన్ ఛాన్స్ అని బెదిరించాడట. కానీ తన తండ్రితో అక్కడికి వెళ్లిన అప్సర.. వెంటనే పారిపోయి వచ్చేసిందట. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనకు అలాంటి అనుభవాలు ఏమీ ఎదురుకాలేదని, టాలెంట్ ఉన్నవారిని టాలీవుడ్ ఎప్పుడూ ఆదరిస్తుందని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేస్తున్న 'డేంజరస్' సినిమాలో నటిస్తోంది అప్సర రాణి. అసలైతే తన పేరు అంకిత మహారాణ కానీ టాలీవుడ్‌కు వచ్చిన తర్వాత తన స్క్రీన్ నేమ్‌ను అప్సర రాణిగా మార్చేశాడు వర్మ. రవితేజ హీరోగా వచ్చిన 'క్రాక్'తో అప్పర రాణి ఐటెమ్ గర్ల్‌గా కూడా మారింది. ప్రస్తుతం తాను ఐటెమ్ గర్ల్‌గా పలు సినిమాల్లో మెరవనుంది.

Tags

Read MoreRead Less
Next Story