Armaan Malik: 'సర్కారు వారి పాట' సాంగ్ అప్డేట్‌పై బాలీవుడ్ సింగర్ ట్వీట్..

Armaan Malik: సర్కారు వారి పాట సాంగ్ అప్డేట్‌పై బాలీవుడ్ సింగర్ ట్వీట్..
Armaan Malik: సర్కారు వారి పాట నుండి ఇప్పటివరకు కేవలం ఒక టీజర్, రెండు పాటలు మాత్రమే విడుదలయ్యాయి.

Armaan Malik: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు తన తరువాతి సినిమా 'సర్కారు వారి పాట' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యి చాలాకాలమే అయినా.. ఇంకా చిత్రీకరణ దశలోనే ఉండడం వారిని కాస్త నిరాశకు గురిచేస్తోంది. అయితే మూవీ నుండి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం కూడా ఒక మైనస్‌లాగా మారింది. తాజాగా ఈ సినిమాలోని తరువాతి సాంగ్ అప్డేట్‌పై ఓ బాలీవుడ్ సింగర్ ట్వీట్ చేశాడు.

పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట నుండి ఇప్పటివరకు కేవలం ఒక టీజర్, రెండు పాటలు మాత్రమే విడుదలయ్యాయి. అయితే ఇందులోని పాటలు అందరినీ ఆకట్టుకుంటూ ఉండడంతో ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా సినిమాలోని పాటలు విడుదల చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ మూవీ టీమ్ నుండి దీనిపై ఎలాంటి స్పందన లేదు. అప్డేట్ ఎప్పుడు అని అడుగుతున్న అభిమానులను ఉద్దేశిస్తూ సింగర్ అర్మాన్ మాలిక్ ఓ ట్వీట్ చేశాడు.

'నాకు మెసేజ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు.. సర్కారు వారి పాట నుండి సాంగ్ ఎప్పుడు వస్తుందో నాకు అస్సలు తెలీదు. అది వినడానికి మీరంతా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. నన్ను నమ్మండి. నేను కూడా ఎదురుచూస్తున్నాను. కానీ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం చేయగలిగింది ఓర్పుగా ఎదురుచూడడమే' అని అర్మాన్ మాలిక్ ట్వీట్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story