Revanath : పునీత్ రాజ్‌కుమార్ ఇంట మరో విషాదం..!

Revanath : పునీత్ రాజ్‌కుమార్ ఇంట మరో విషాదం..!
Revanath : కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం నెలకొంది.

Revanath : కన్నడ దివంగత నటుడు పునీత్ రా‌‌జ్‌‌కుమార్ ఇంట మరో విషాదం నెలకొంది. ఆయన భార్య అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 78సంవత్సరాలు. బెంగళూరులోని ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రిలో రేవనాథ్ తుదిశ్వాస విడిచారు.

పునీత్ మరణానంతరం రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం బారిన పడడంతో గుండెపోటు వచ్చింది. ఆయనని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా తుదిశ్వాస విడిచారు. కాగా రేవనాథ్ NHAI చీఫ్ ఇంజనీర్‌గా పనిచేశారు.

రేవనాథ్ స్వస్థలం చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా.. పునీత్ లాగే రేవనాథ్ కూడా తన కళ్ళని దానం చేశారు. భర్త పునీత్ రాజ్‌కుమార్ మృతితో బాధలో ఉన్న అశ్వినికి తండ్రి రేవనాథ్ మరణం తీరని లోటని చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story