Gangubai Kathiawadi: 'గంగూబాయి కతియావాడి' ట్రైలర్‌పై ట్రాన్స్‌జెండర్స్ ఫైర్..

Gangubai Kathiawadi: గంగూబాయి కతియావాడి ట్రైలర్‌పై ట్రాన్స్‌జెండర్స్ ఫైర్..
Gangubai Kathiawadi: గంగూబాయి కతియావాడిలో విలన్‌గా కనిపించే ఓ ట్రాన్స్ ఉమెన్ పాత్రను విజయ్ రాజ్ పోషించాడు.

Gangubai Kathiawadi: గంగూబాయి కతియావాడి.. ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఎన్నో బయోపిక్స్ తెరకెక్కాయి. కానీ ఈ బయోపిక్ మాత్రం వాటన్నింటికంటే కొంచెం భిన్నమైనది. ఒక వేశ్యగా ఉండి కూడా ముంబాయిలోని కతియావాడి ప్రాంతాన్ని ఏలిన గంగూబాయి కథ ఇది. ఇప్పటివరకు తన గురించి చాలామందికి తెలియదు. అందుకే తన కథను ఓ సినిమా రూపంలో అందరికీ చెప్పడానికి ముందుకొస్తున్నాడు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.

ఆలియా హీరోయిన్‌గా నటించిన గంగూబాయి కతియావాడి సినిమా ట్రైలర్.. ఇటీవల అన్ని భాషల్లో విడుదలయ్యి సూపర్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. సెలబ్రిటీలు సైతం ఇందులో ఆలియా యాక్టింగ్‌కు ఫిదా అయిపోయి.. ఈ ట్రైలర్‌ను వారి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే పాజిటివిటీతో పాటు ఈ ట్రైలర్‌కు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

గంగూబాయి కతియావాడి అనేది ఆలియా సినిమా అని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో విలన్‌గా కనిపించే పాత్ర ఓ ట్రాన్స్ ఉమెన్. ఈ పాత్రను విజయ్ రాజ్ పోషించాడు. ఇలాంటి ఓ పాత్రను విజయ్ రాజ్ పోషించడంపై ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయో.. అంతకంటే ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

గంగూబాయి కతియావాడి చిత్రంలో విజయ్ రాజ్ పోషిస్తున్న 'రజియా' పాత్ర చాలా కీలకం అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే దీనిపై ట్రాన్స్‌జెండర్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తు్న్నారు. ట్రాన్స్‌జెండర్స్‌లో కూడా టాలెంట్ ఉన్నవారు చాలామందే ఉన్నారు. వారికి అవకాశం ఇస్తే.. వారే ఇలాంటి పాత్రలు ఇంకా బాగా చేయగలుగుతారు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం విజయ్ రాజ్ ఏ పాత్ర చేసినా ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story