Balakrishna: అప్పుడు పవన్.. ఇప్పుడు బాలకృష్ణ.. అలాంటి పాత్రలో..

Balakrishna: అప్పుడు పవన్.. ఇప్పుడు బాలకృష్ణ.. అలాంటి పాత్రలో..
Balakrishna: పవన్ కళ్యాణ్ ముందు నుండి అయినా రీమేక్ సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనకడారు.

Balakrishna: హీరోల్లో కొన్ని పాత్రలు కొంతమంది చేస్తేనే బాగుంటుంది అన్న భావన ప్రేక్షకులకు బలంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం హీరోలంతా తమ పరిధిని దాటి కొత్త పాత్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే.. డీ గ్లామర్‌గా కనిపించడానికి అయినా సిద్ధమయిపోతున్నారు. ఇది తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల ఏర్పడిన మంచి పరిణామమే. అయితే తాజాగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే విధమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.



పవన్ కళ్యాణ్ ముందు నుండి అయినా రీమేక్ సినిమాలు చేయడానికి ఏ మాత్రం వెనకడారు. తమిళ, మలయాళం మాత్రమే కాదు.. పవన్ తన కెరీర్‌లో పలు హిందీ చిత్రాల రీమేక్‌లో కూడా నటించాడు. అలా హిందీలో అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్' సినిమాను తెలుగులో 'గోపాల గోపాల'గా రీమేక్ చేశాడు. ఇందులో వెంకటేశ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు పవన్.


గోపాల గోపాలలో దేవుడి పాత్రలో కనిపించి అలరించాడు పవన్. అయితే తమిళ చిత్రం 'వినోదాయ సిత్తం' రీమేక్‌లో పవన్ నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే ప్రచారం నిజమయితే.. పవన్ మరోసారి ఈ సినిమా కోసం దేవుడిగా కనిపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య కూడా పవన్ ట్రెండ్‌నే ఫాలో అవ్వనున్నట్టు సమాచారం.


ఒకప్పుడు బాలకృష్ణ దేవుడి పాత్రల్లో పలు సినిమాలు చేశారు. అయితే అవన్నీ పూర్తిగా పౌరాణిక చిత్రాలే. మోడర్న్‌గా తెరకెక్కిన చిత్రాలు కాదు. కానీ త్వరలోనే బాలయ్య అలాంటి ఓ చిత్రంలో నటించనున్నట్టు టాక్. అంటే పవన్‌లాగానే మోడర్న్ డేస్‌లో దేవుడిగా నటించనున్నాడట. ఇప్పటివరకు బాలయ్య దేవుడి పాత్రలు చేసినా కూడా.. మోడర్న్ డేస్‌లో దేవుడిగా చేయకపోవడంతో.. అభిమానులు దీని అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story