Balakrishna: బాలయ్యకు మైనర్ సర్జరీ.. ఇంతకీ ఏం జరిగింది..?

Balakrishna: బాలయ్యకు మైనర్ సర్జరీ.. ఇంతకీ ఏం జరిగింది..?
Balakrishna: అఖండ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య కుడిభుజానికి గాయం కావడంతో అప్పుడు కూడా ఆయనకు మైనర్ సర్జరీ జరిగింది.

Balakrishna: నందమూరి హీరో బాలకృష్ణ.. 'అఖండ' సినిమాతో తన ఫ్యాన్స్‌కు మర్చిపోలేని గిఫ్ట్‌ను అందించాడు. చాలాకాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ హిట్‌ను కొట్టడంతో పాటు కలెక్షన్ల విషయంలో కూడా పలు రికార్డును బద్దలుకొట్టింది అఖండ. ఇక ఆయన తర్వాత సినిమా గురించి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు షాకింగ్ విషయం తెలిసింది.

ఇటీవల బాలకృష్ణ దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ ఫోటోలో బాలయ్య మోకాలికి కట్టు ఉండడంతో ఏమైందో అని అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే బాలయ్య మోకాలికి శస్త్రచికిత్స జరిగిందంటూ సమాచారం. గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న బాలయ్యకు డాక్టర్లు ఇటీవల శస్త్రచికిత్స చేశారట.


ఇక అఖండ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య కుడిభుజానికి గాయం కావడంతో అప్పుడు కూడా ఆయనకు మైనర్ సర్జరీ జరిగింది. ఇది జరిగి కొంతకాలమే అయ్యింది. ఇప్పుడు బాలకృష్ణకు మరో సర్జరీ జరగడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. వారందరూ బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సర్జరీ వల్ల బాలయ్య.. గోపీచంద్ మలినేనితో తీస్తున్న సినిమా షూటింగ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story