Bappi Lahiri: బప్పీలహరి తెలుగులో పాడిన చివరి పాట ఇదే..

Bappi Lahiri (tv5news.in)

Bappi Lahiri (tv5news.in)

Bappi Lahiri: 1986లో వచ్చిన సింహాసనం సినిమాతో తెలుగులో కెరీర్ మొదలుపెట్టారు.

Bappi Lahiri: ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్‌ పాటతో ఓ ఊపు ఊపిన ఈ బెంగాలీ మ్యూజిక్ డైరెక్టర్.. ఆ తరువాత బాలీవుడ్‌ను శాసించారు. తెలుగులోనూ ఎన్నో హిట్‌ సాంగ్‌ అందించారు. హీరో కృష్ణ సింహాసనం మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన బప్పీ లహరి.. ఆ తరువాత ఎన్నో బంపర్ హిట్‌ సాంగ్స్‌ కంపోజ్ చేశారు.

1952 నవంబర్‌ 27న బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అలొకేష్ లహరి.. ఆ తరువాత బప్పీ లహరి పేరుతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎనలేని ఖ్యాతి గడించారు. తండ్రి అపరేష్, తల్లి బన్సూరి ఇద్దరూ మ్యుజీషియన్స్, సింగర్స్ కావడంతో.. ఆటోమేటిక్‌గా బప్పీ లహరి కూడా మ్యూజిక్‌నే కెరీర్‌గా ఎంచుకున్నారు. మూడేళ్ల వయసులోనే తబలా వాయించడం మొదలుపెట్టారు. గాయకుడు కిషోర్‌ కుమార్‌ బప్పీ లహరికి మామయ్య అవుతారు.

1986లో వచ్చిన సింహాసనం సినిమాతో తెలుగులో కెరీర్ మొదలుపెట్టారు. ఆ తరువాత 1987లో త్రిమూర్తులు, 1989లో స్టేట్‌రౌడీ, 1991లో గ్యాంగ్‌ లీడర్, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, బ్రహ్మ, 1993లో నిప్పు రవ్వ, 1995లో బిగ్‌ బాస్, ఖైదీ ఇన్‌స్పెక్టర్, పుణ్యభూమి నా దేశం సినిమాలకు మ్యూజిక్‌ అందించారు. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. ఇప్పటికీ బప్పీ లహరి సాంగ్స్‌ మారుమోగిపోతూనే ఉంటాయి.

బప్పీ లహరి అంటే ఎనర్జిటిక్ సాంగ్స్‌కు పెట్టింది పేరు. దేశం మొత్తం బప్పీ లహరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బప్పీ పాటలు వస్తున్నాయంటే.. దేశం మొత్తం ఎదురుచూసేది. సంప్రదాయ సంగీత నేపథ్యంతో పాటలు, అప్పుడప్పుడు బీట్‌ సాంగ్స్ రావడం మాత్రమే అప్పటి తరానికి తెలుసు. కాని, బప్పీ లహరి వచ్చిన తరువాత ఆ ట్రెండ్‌నే మార్చేశారు.

ఇండియన్ మూవీ ఇండస్ట్రీకి కొత్త తరహా సంగీతాన్ని పరిచయం చేశారు. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌కు సింథసైజ్డ్‌ డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసింది బప్పీ లహరినే. ఫాస్ట్ మ్యూజిక్, సూపర్‌ ఫాస్ట్ మూజిక్, హైపర్ ఫాస్ట్‌ మ్యూజిక్‌ అంటూ.. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని పాటలు అందించారు.

బప్పీ లహరి మ్యూజిక్‌ అంటే.. గాయనీ గాయకులు కూడా గొంతు మార్చి కొత్తరకంగా పాడాల్సిందే అన్నట్టుండేది. వందల పాటలు పాడిన వాళ్లు కూడా ఓ ఫ్రెష్‌ సాంగ్ పాడిన ఫీలింగ్ కలిగిందనే వారు. బప్పీ లహరి కేవలం డిస్కో పాటలు, ఫాస్ట్ సాంగ్స్ మాత్రమే కాదు.. ఎన్నో మెలోడీలు అందించారు. బ్రహ్మ, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు, స్టేట్‌ రౌడీ సినిమాల్లోని మెలోడీ పాటలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

బప్పీ లహరి అంటే ఒక బ్రాండ్. ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి.. నగల దుకాణమే కదిలి వస్తుందా అన్నట్టు ఉండేవారు. కానీ బంగారం అంటే మోజు కాదని.. అది తనకు దేవుడు అని చెబుతుండే వారు. Gold is my God అనే స్లోగన్ పదే పదే చెప్పేవారు. చివరగా తెలుగులో 2020లో రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. రమ్ పమ్ పమ్ అంటూ రాక్ స్టైల్‌లో పాటను పాడారు బప్పీ లహరి.

Tags

Read MoreRead Less
Next Story