Acharya : 'భలే భలే బంజారా'.. ప్రోమో అదుర్స్..!

Acharya : భలే భలే బంజారా.. ప్రోమో అదుర్స్..!
Acharya : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Acharya : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటిస్తుండడంతో ఈ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్.. ఈ సినిమాలో 'భలే భలే బంజారా' అనే పాటకు సంబంధించిన ప్రోమో సాంగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమో సాంగ్ వీడియోలో చిరు, చరణ్‌లు కలిసి వేసిన స్టెప్స్‌కు మెగా ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు.

తండ్రీకొడుకులు ఇద్దరు మంచి డాన్సర్స్ కావడంతో ఫుల్ సాంగ్ పైన అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్, పూజా హేగ్దే హీరోయిన్ లు గా నటిస్తున్నారు. . ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలతో కలిసి చరణ్ సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.



Tags

Read MoreRead Less
Next Story