Bheemla Nayak Twitter Review: పవన్ నటన సూపర్ అన్నా.. భీమ్లానాయక్ ట్విట్టర్ రివ్యూ

Bheemla Nayak Twitter Review: పవన్ నటన సూపర్ అన్నా.. భీమ్లానాయక్ ట్విట్టర్ రివ్యూ
Bheemla Nayak Twitter Review: పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రాలలో ఒకటైన భీమ్లా నాయక్ శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది.

Bheemla Nayak Twitter Review: పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రాలలో ఒకటైన భీమ్లా నాయక్ శుక్రవారం థియేటర్లలో సందడి చేస్తోంది. బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్- నటించిన మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి రీమేక్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి- నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న సినిమా హాళ్లలో విడుదలైంది.

సినీ విమర్శకులు పవన్ కళ్యాణ్, రానా నటనను ప్రశంసిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగిన చిత్రం పవన్ అభిమానులను ఆకట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయిందని సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రానా నటన కూడా అద్భుతంగా ఉంది.. త్రివిక్రమ్ మార్క్ కనిపించింది అని ఇప్పటికే సినిమా చూసిన యూఎస్ ప్రేక్షకులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

నటి నిత్యా మీనన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. అయితే ఆమె విలన్ పాత్ర పోషించిన రానాను, డేనియల్ శేఖర్‌ను కూడా ఎదుర్కొంటుంది. సంయుక్తా మీనన్, మురళీ శర్మ, సముద్రఖని తమ నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. థమన్ సంగీతం మరియు రవి కె చంద్ర కెమెరా పనితనం కూడా చిత్రానికి హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు.

మలయాళం సినిమాలో ఇద్దరు హీరోలకు సమాన ఇమేజ్ ఉండగా.. ఇక్కడ తెలుగు ప్రేక్షకులు అందునా పవన్ ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకుని అతడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పవన్ ఇమేజ్‌కి అనుగుణంగా కొన్ని కీలక సన్నివేశాల్లో మార్పులు చేశారు. ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీమియర్స్ రూపంలో వన్ మిలియన్ మార్కును క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. భీమ్లా నాయక్ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేశారు. అయితే ఒక వారం రోజుల తర్వాత హిందీలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు









Tags

Read MoreRead Less
Next Story