Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కరోనా..!

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi (tv5news.in)

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌‌లో ఉన్నట్టుగా వెల్లడించారు. ఇటీవల తనని కలసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని చిరు సూచించారు. ఇదిలావుండగా గతంలో కూడా చిరంజీవికి టెస్ట్ చేసినప్పుడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కానీ ఆ తర్వాత మళ్లీ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. కాగా కీర్తి సురేష్ మెయిన్ లీడ్‌‌లో తెరకెక్కిన గుడ్ లక్‌‌సఖి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు . (జనవరి 26)న హైదరాబాద్ పార్క్ హయత్‌‌లో జరగనుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయనకి కరోనా సోకడంతో ఈ వేడుకకి వెళ్ళడం లేదు.



Tags

Read MoreRead Less
Next Story