Deepika Padukone : అందరి ముందూ రొమాన్స్.. చాలా ఆలోచించా: దీపికా పదుకొణె

Deepika Padukone : అందరి ముందూ రొమాన్స్.. చాలా ఆలోచించా: దీపికా పదుకొణె
Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణే, అనన్యాపాండే, సిద్ధాంత్ చతుర్వేది నటించిన 'గెహరైయాన్' ట్రైలర్ బాగా ట్రెండ్ అవుతోంది.

Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణే, అనన్యాపాండే, సిద్ధాంత్ చతుర్వేది నటించిన 'గెహరైయాన్' ట్రైలర్ బాగా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల రోజున, చిత్ర నిర్మాత కరణ్ జోహార్ లాంచ్ సందర్భంగా ప్రాజెక్ట్ గురించి కొన్ని విశేషాలను పంచుకున్నారు. దీపికా పదుకొణె స్క్రిప్ట్ విన్న తర్వాత ఓకే చేయడానికి చాలా టైమ్ తీసుకుంది. అలాగే, ఆమెకు సినిమా స్క్రిప్ట్‌ని చెప్పడానికి షకున్ బాత్రా లండన్ వెళ్లాడు.

ఆమె సినిమా చేయడానికి ఒప్పుకుంటుందో లేదో అని షకున్ కొంచెం ఆందోళన చెందాడు. అప్పుడు నేను అప్‌డేట్ తెలుసుకునేందుకు దీపికకు కాల్ చేసాను. అప్పుడు ఆమె కథ నచ్చింది కానీ నటించడానికి ఆలోచిస్తున్నాను.. నాకు మరికొంత సమయం కావాలని అడిగింది అని కరణ్ పేర్కొన్నారు. సినిమా టైటిల్ గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ.. " నెలన్నర క్రితమే గెహరైయాన్ అనే టైటిల్ పెట్టాం.

ఈ చిత్రంలో దీపికా పదుకొణె, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, ధైర్య కర్వా, నసీరుద్దీన్ షా మరియు రజత్ కపూర్ నటించారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. సెట్‌లో అందరి ముందు కోస్టార్స్‌తో అలాంటి సన్నివేశాల్లో నటించడం అంత ఈజీ కాదు. దర్శకుడు షకున్ అన్ని విధాలుగా భద్రత కల్పించిన తర్వాతే ఆ సన్నివేశాలు చేయగలిగాను.. ఇలాంటి కథను ఇంతకు ముందెన్నడూ చూడలేదు అని అన్నారు దీపికా పదుకొణె.

ఈ చిత్రంలో దీపిక, అనన్య బంధువులు. అనన్యతో ఎంగేజ్‌మెంట్ అయిన తరువాత దీపిక ప్రేమలో పడతాడు సిద్ధాంత్. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్.. విషయం అనన్యకు తెలిసిపోవడంతో కథ ఆసక్తిగా సాగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story