Rajamouli : బాహుబలి 3 ఆలోచనలో జక్కన్న..టార్గెట్‌ రూ. 2000 కోట్లు..!

SS Rajamouli (tv5news.in)

SS Rajamouli (tv5news.in)

Rajamouli : పాన్ ఇండియా సినిమాలకు ఉండే క్రేజ్ వేరు.. ఆ పాన్ ఇండియా సినిమాలకి వచ్చే సీక్వెల్స్ కి ఉండే క్రేజ్ వేరు..

Bahubali 3 : పాన్ ఇండియా సినిమాలకు ఉండే క్రేజ్ వేరు.. ఆ పాన్ ఇండియా సినిమాలకి వచ్చే సీక్వెల్స్ కి ఉండే క్రేజ్ వేరు..పాన్ ఇండియా మూవీకి సీక్వెల్ గా వచ్చి అప్పుడు బాహుబలి 2 బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే.. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పుడు ఈ రెండు సినిమాల వరుసలో నిలబడే అవకాశాలు ఎక్కువగా అల్లు అర్జున్, సుకుమార్ ల క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప పార్ట్ 2 కి ఉన్నాయి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అయింది పార్ట్ 1, అందుకు ఏ మాత్రం తగ్గకుండా పార్ట్ ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.

అభిమానుల అంచనాలను ఈ సీక్వెల్ బీట్ చేస్తే మరో ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఇక RRR మూవీ సీక్వెల్ పైన సైలెంట్ గా ఉన్న జక్కన్న.. బాహుబలి 3 మాత్రం భవిష్యత్తులో ఉండొచ్చని అంటున్నారు.. బహుబలి 3 థియేటర్స్ కు వచ్చిన రోజున మాత్రం తెలుగు సినిమా స్థాయితో పాటుగా ఇండియన్ సినిమా మరో ఎత్తు ఎదగడం ఖాయమని చెప్పాలి.

బాహుబలి 2 అప్పుడే 1600 కోట్లుకుపైగా కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు దానికి సీక్వెల్ అంటే మినిమం రెండు వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయమని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags

Read MoreRead Less
Next Story