Ram Gopal varma : బాలీవుడ్ ఇండస్ట్రీ పై వర్మ సెటైర్లు..!

Ram Gopal varma :  బాలీవుడ్ ఇండస్ట్రీ పై వర్మ సెటైర్లు..!
Ram Gopal varma : బాలీవుడ్ ఇండస్ట్రీ పైన టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు.

Ram Gopal varma : బాలీవుడ్ ఇండస్ట్రీ పైన టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. కేజీఎఫ్ 2 హిందీలో భారీ ఓపెనింగ్స్ రాబడుతుండడంతో వర్మ ట్విట్టర్ వేదికగా బీటౌన్ ని టార్గెట్ చేశాడు.

బాలీవుడ్ అని పిలవబడే హిందీ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఏం ఆలోచిస్తుందో.. కన్నడ నుంచి డబ్ చేసిన కేజీఎఫ్ 2, తెలుగు నుంచి డబ్ చేసిన RRR మూవీస్ హిందీ చరిత్రలో భారీ ఓపెనింగ్స్ సాధించాయి." ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఏంటో అన్నట్లుగా వర్మ ట్వీట్ చేశాడు.

అంతేకాకుండా తొలిరోజున వ‌సూళ్లు సాధించిన టాప్ టెన్ సినిమాల లిస్టుల‌ను కూడా తన ట్వీట్ లో పెట్టారు వర్మ. ఆర్జీవీ పోస్ట్ చేసిన టాప్ టెన్ ఓపెనింగ్ క‌లెక్షన్స్ సాధించిన చిత్రాల‌ను గ‌మ‌నిస్తే.. తొలి స్థానంలో KGF 2కి రూ.38-39 కోట్లు రాబోతున్నట్లు, బాహుబ‌లి 2 రూ.37.53 కోట్లు సాధించాయ‌ని తెలుస్తుంది.

కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 నేడు (ఏప్రిల్ 14)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.



Tags

Read MoreRead Less
Next Story