Samantha Ruth Prabhu: సమంత రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు.. 'పుష్ప'తో పాటు..

Samantha Ruth Prabhu: సమంత రిజెక్ట్ చేసిన హిట్ సినిమాలు.. పుష్పతో పాటు..
Samantha Ruth Prabhu: ఈ చిత్రంలో విక్రమ్ హీరో. సమంత కాదనడంతో అమీ జాక్సన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు.

Samantha Ruth Prabhu: కథ నచ్చకో, డేట్స్ కుదరకో వచ్చిన ఆఫర్‌ని తిరస్కరిస్తుంటారు నటీనటులు.. ఒక్కోసారి అవే సూపర్ డూపర్ హిట్టవుతుంటాయి. ఇది ఇండస్ట్రీలో సర్వసాధారణమే అయినా, ప్రేక్షకులకి మాత్రం ఆ విషయం తెలిసి అవునా.. నిజమా అని అనుకోక మానరు.

దక్షిణాది తారల్లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టెర్‌గా పేరు తెచ్చుకున్న సమంత.. ఈ మధ్యే వచ్చిన పుష్ప దిరైజ్‌ సినిమాలో ఐటెం సాంగ్ చేసి ప్రపంచం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. ఆ పాట చేయడానికి క్కూడా డైరెక్టర్ సుకుమార్ ఆమెని ఒప్పించాల్సి వచ్చిందట.

అయితే ఆ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఐటెం సాంగ్ కంటే ముందు శ్రీవల్లి క్యారెక్టర్ కోసం సమంతనే ముందు సంప్రదించిందట చిత్ర యూనిట్. కానీ ఆమె ఆఫర్‌ను తిరస్కరించడంతో అల్లు అర్జున్‌కి జోడీగా నటించేందుకు రష్మిక మందన్న లైన్‌లోకి వచ్చింది. ఈ యాక్షన్, డ్రామా మూవీ 2021 చివరిలో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపించింది.



మరో సినిమా అల్లు అర్జున్, రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ సినిమాని కూడా సమంత రిజెక్ట్ చేసిందట.



శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఐ' చిత్రాన్ని కూడా సమంత తిరస్కరించింది. ఈ చిత్రంలో విక్రమ్ హీరో. సమంత కాదనడంతో అమీ జాక్సన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు.



ఇక నాని నటించిన 'నిన్నుకోరి' సినిమాకు మొదట సమంతనే అనుకున్నారట. కానీ ఆమె తిరస్కరించడంతో ఆ క్యారెక్టర్ నివేదా థామస్‌ని వరించింది. ఈ క్యూట్ లవ్ స్టోరీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. నాని చేసిన హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.



సమంత గత ఏడాది మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన తమిళ చిత్రం 'కాతు వాకులా రెండు కాదల్', తెలుగు చిత్రం 'శాకుంతలం' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాప్సీ పన్ను నిర్మించిన మహిళా ప్రధాన చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సమంత ఎంట్రీ ఇవ్వన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story