Garikapati On Pushpa: సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు.. 'పుష్ప' సినిమాపై గరికపాటి ఫైర్..

Garikapati On Pushpa: సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు.. పుష్ప సినిమాపై గరికపాటి ఫైర్..
Garikapati On Pushpa: పుష్ప సినిమాలో స్మగ్లింగ్‌ను హైలెట్ చేసి చూపించారని, అది సరికాదు అన్నారు గరికపాటి.

Garikapati On Pushpa: గరికపాటి నరసింహా రావు.. ఈ రోజుల్లో ఈయన ప్రవచనాల గురించి తెలియని వారు చాలా తక్కువ. మామూలుగా ప్రవచనాలు అన్నా, ఉపదేశాలు అన్నా.. పెద్దగా ఇష్టపడని యూత్‌కు ప్రవచనాలు అంటే ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు గరికపాటి. ఆయన వల్లే ప్రస్తుతం చాలామంది ప్రవచనాలకు అలవాటు పడ్డారు. తాజాగా గరికపాటి.. పుష్ప సినిమాపై ఫైర్ అయ్యారు.

జీవిత సత్యాలను మామూలు భాషలో, అందరికీ అర్థమయ్యే విధంగా ఇంట్రెస్టింగ్‌గా చెప్పే వ్యక్తి గరికపాటి. అందుకే ఆయన సేవలకు ఇటీవల పద్మశ్రీ కూడా అందుకున్నారు. ఆ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో ఆయన పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పుష్ప సినిమాపై ఆయన అభిప్రాయాన్ని వెల్లడించడమే కాకుండా మూవీ టీమ్‌పై ఫైర్ అయ్యారు కూడా.

పుష్ప సినిమాలో హీరో ఒక స్మగ్లర్. ఓ స్మగ్లర్‌ను హీరోగా చూపించిన అంశంపై గరికపాటి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ హీరో చివర్లో మంచి పనులు చేస్తాడుగా, రెండోభాగంలో తన క్యారెక్టర్ మంచిగా చూపిస్తారేమో అని ఎవరైనా అనవచ్చని, కానీ రెండోభాగం వచ్చేలోనే హీరో ఒక స్మగ్లర్ అని అందరి దృష్టిలో ముద్ర పడిపోయిందన్నారు గరికపాటి.

పుష్ప సినిమాలో స్మగ్లింగ్‌ను హైలెట్ చేసి చూపించారని, అది సరికాదు అన్నారు గరికపాటి. అల్లు అర్జున్ 'తగ్గేదే లే' అన్న డైలాగును యూత్ బాగా ఫాలో అవుతుందని, అంటే యూత్‌పై చెడు ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. ఇలాంటి చెడు ప్రభావానికి ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. హీరో అయినా, డైరెక్టర్ అయినా తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే అన్నారు గరికపాటి.

హరిశ్చంద్రుడు, శ్రీరాముడు లాంటి వారు తగ్గేదే అన్న పదం ఉపయోగించాలి కానీ ఒక స్మగ్లర్ ఎలా ఉపయోగిస్తాడు అన్నారు గరికపాటి. ఈ డైలాగు వల్లే క్రైమ్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది అని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story