సినిమా

Gayatri Rao: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హ్యాపీ డేస్ అప్పు.. తల్లిదండ్రులతో డెబ్యూ చేసి..

Gayatri Rao: హ్యాపీ డేస్ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన అప్పు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

Gayatri Rao (tv5news.in)
X

Gayatri Rao (tv5news.in)

Gayatri Rao: హ్యాపీ డేస్ సినిమా ఒక సంచలనం. బీటెక్ అంటే చాలామందికి తెలియన రోజుల్లో అసలు బీటెక్ కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అని కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. అప్పటివరకు ఇండస్ట్రీ హిట్స్‌గా కేవలం మాస్ సినిమాలే ఉన్న రోజుల్లో హ్యాపీ డేస్ వచ్చి అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటికీ చాలామంది యూత్‌కు ఇది ఫేవరెట్ సినిమా. అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన అప్పు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

హ్యాపీ డేస్ సినిమాలో ఏ పాత్ర తక్కువ కాదు.. ఇందులో మనం చూసిన ప్రతీ పాత్ర, ప్రతీ హీరో, ప్రతీ హీరోయిన్ మనకు ఇప్పటికీ గుర్తుండిపోతారు. వరుణ్ సందేశ్‌కు ఇది మొదటి చిత్రమే అయినా అందరికీ గుర్తుండిపోయేలా నటించి ఇండస్ట్రీలో హీరోగా ఆఫర్లు కొట్టేశాడు. తమన్నా అంతకు ముందే పలు సినిమాల్లో నటించినా.. తనకు గుర్తింపును తెచ్చిపెట్టింది హ్యాపీ డేస్.

ఇక శంకర్, టైసన్, అప్పు, రాజేశ్.. ఈ పాత్రలన్నీ అప్పుడే కాదు.. ఇప్పటి యూత్‌కు కూడా కనెక్ట్ అయిపోయేలా ఉంటాయి. వీరిలో ప్రతీ హీరో లేదా హీరోయిన్ ఏదో ఒక సినిమాలో మనకు అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉన్నారు. రాజేశ్‌గా నటించిన నిఖిల్ ప్రామిసింగ్ హీరోలాగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. కానీ అప్పుగా నటించిన గాయత్రి రావు మాత్రం హ్యాపీ డేస్ తర్వాత కేవలం రెండే సినిమాల్లో నటించింది.


హ్యాపీ డేస్‌లో ఒక హీరోయిన్‌గా చేసిన తర్వాత ఆరెంజ్, గబ్బర్ సింగ్‌లాంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది అప్పు అలియాస్ గాయత్రి రావ్. ఆ తర్వాత సినిమాల్లో కనిపించడానికి తాను పెద్దగా ఆసక్తి చూపించలేదు. పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్‌ను స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కనిపిస్తున్న అప్పు చాలా మారిపోయింది. ఇప్పుడు తనను చూస్తే ఎవరూ గుర్తుపట్టలేనంతగా తనలో మార్పు వచ్చింది.

అప్పు తల్లిదండ్రులు కూడా సినిమా ఫీల్డ్‌లో ఉన్నవారే. చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఏంటంటే అప్పు డెబ్యూ చేసిన హ్యాపీ డేస్ సినిమాలో తన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. రాజేశ్‌గా నటించిన నిఖిల్‌కు తల్లి పాత్రలో ఆమె కనిపించారు. టాలీవుడ్‌లో ఆమెను బెంగళూరు పద్మ అని పిలుస్తారు. సినిమాలో తమన్నా తండ్రిగా నటించిన ఆయనే అప్పు తండ్రి. ఇలా తల్లిదండ్రులతో కలిసి మొదటిసారి స్క్రీన్‌పై మెరిసిన అప్పు మెల్లగా సినిమాలకు దూరమయిపోయింది.Next Story

RELATED STORIES