Prabhas : 'రాధేశ్యామ్' రిజల్ట్ పై స్పందించిన ప్రభాస్..!

Prabhas : రాధేశ్యామ్ రిజల్ట్ పై స్పందించిన ప్రభాస్..!
Prabhas : బాహుబలి మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

Prabhas : బాహుబలి మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీస్ నే చేస్తూ వస్తున్నాడు.. అందులో భాగంగానే భారీ అంచనాల నడుమ గత నెలలో ప్రభాస్ హీరోగా రిలీజైన మూవీ రాధేశ్యామ్.

ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో ప్రేక్షకుల్లో చాలా హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. అయితే ఈ మూవీ రిజల్ట్ పైన హీరో ప్రభాస్ స్పందించాడు.

"సినిమా రిలీజ్ సమయానికి కరోనా వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకపోవడమే కారణం అనుకుంటున్నా. దాంతో పాటు నన్ను ప్రేమ కథల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడి ఉండకపోవచ్చు. లేదా ఆ స్క్రిప్టులోనే ఏదైనా లోపం కూడా ఉండి ఉండొచ్చు" అని ప్రభాస్ తెలిపాడు.

కాగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీలో ప్రభాస్ విక్రమాదిత్యగా నటించగా, అతని సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అటు ప్రభాస్ సినిమాల విషయానికి వచ్చేసరికి చేతిలో అరడజన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటుగా మారుతి, సుజిత్ లతో సినిమాలు చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story