Suriya : గొప్ప మనసు చాటుకున్న హీరో సూర్య ... మత్స్యకారుల కోసం

Suriya :  గొప్ప మనసు చాటుకున్న  హీరో సూర్య ...  మత్స్యకారుల కోసం
Suriya : కేవలం హీరోగానే సూర్య ప్రేక్షకులకి దగ్గర కాలేదు.. మంచి మనసున్న మనిషిగా సూర్య అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు.

Suriya : కేవలం హీరోగానే సూర్య ప్రేక్షకులకి దగ్గర కాలేదు.. మంచి మనసున్న మనిషిగా సూర్య అభిమానుల్లో పేరు సంపాదించుకున్నాడు. అలాంటి సూర్య మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం సూర్య.. స్టార్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో సూర్య మత్స్యకారుడు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా కన్యాకుమారి ప్రాంతంలో జరుగుతోంది. జాలర్లు నివసించే గుడిసెల తరహాలో భారీ ఖర్చుతో గుడిసెల సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు. అయితే షూటింగ్ అయిపోయాక వాటిని కూల్చివేయకుండా ఇల్లు లేని పేద మత్స్యకారులకి ఉచితంగా ఇవ్వాలని సూర్య నిర్ణయం తీసుకున్నారు. దీనితో సూర్య గొప్ప మనసుని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story